పన్ను ఊడినా పట్టించుకోకుండా వార్తలు చదివిన న్యూస్ రీడర్

లైవ్‌లో వార్తలు చదివేటప్పుడు న్యూస్ రీడర్లు చాల ఏకాగ్రతతో ఉంటారన్నా విషయం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. . కళ్లముందు ఏం కనిపించినా పట్టించుకోకుండా చెప్పాలనుకున్నది చెప్పేస్తుంటారు. ఏ మాత్రం మనసు అటు ఇటూ పోయినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతారు.
న్యూస్ రీడర్లు ఎంత ఏకాగ్రతగా వార్తలు చదువుతారో ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. లైవ్ లో వార్తలు చదువుతున్నపుడు పన్ను ఊడినా ఏమీ జరగనట్లుగానే న్యూస్ చదివిన ఓ న్యూస్ చదివిన ఓ ఉక్రెయిన్ న్యూస్ రీడర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీఎస్ఎస్ చానల్ న్యూస్ రీడర్ మరీచా పదాల్కో సీరియస్‌గా కరోనా వైరస్ సమాచారాన్ని ప్రజెంట్ చేస్తున్న సమయంలో పై పన్ను కదిలింది. అది కాస్త ఊడి కింద పడేలోపే చేతిలోకి లాగేసుకున్నది. అయినా ఎక్కడా తడబడలేదు. ఈ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇది చూసిన నెటిజన్లు ‘శభాష్’ అంటున్నారు. ‘ఆమె పన్ను తీసే విధానం చూస్తుంటే అది అలవాటైన పనిలా ఉంది అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఆమెకు పని పట్ల ఎంత నిబద్దత ఉందొ ఇది చుస్తే తెలుస్తోంది అంటూ మరికొందరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.