Fact Check : ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన -ఫేక్ స్కీం

స్మార్ట్ ఫోన్లు చౌక ధరకు లభ్యమవటం... సోషల్ మీడియా ప్రతి ఒక్కరూ ఉపయోగించటంతో అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో నిజమెంతో అబధ్దమెంతో తెలియటంలేదు.

Fact Check : ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన -ఫేక్ స్కీం

Fact Check Fake Scheme

Updated On : July 13, 2021 / 4:13 PM IST

Fact Check :  స్మార్ట్ ఫోన్లు చౌక ధరకు లభ్యమవటం… సోషల్ మీడియా ప్రతి ఒక్కరూ ఉపయోగించటంతో అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో నిజమెంతో అబధ్దమెంతో తెలియటంలేదు.

ఇటీవల ప్రధాన మంత్రి కన్యా ఆశీర్వాద్ పేరుతో కేంద్రం ఒక కొత్త పధకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈపధకం అమలులో భాగంగా ఆడపిల్లలు ఉన్నతల్లితండ్రులకప ప్రభుత్వం నెలకు రూ. 2వేల చొప్పున సంవత్సరానికి రూ.24 వేలు వస్తాయంటూ     మోడీ ఫోటో, కమలం గుర్తుతో తయారు చేసిన పోస్ట్ ఒకటి   సోషల్ మీడియాలో, వాట్సప్ ల్లో ప్రచారం జరిగింది.

ఈ పోస్ట్ లో 5 సంవత్సరాలనుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లలు పోస్టాఫీసుల్లో పధకాన్ని అప్లయ్ చేసుకోవాలని, అందుకు తెల్లరేషన్ కార్డు అర్హతగా పరిగణలోకి తీసుకుంటారని హైలైట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌లో నిజమెంత ఉందో చెక్ చేయగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాల్లో అసలు ఈ పధకం లేదని తెలిసింది.

ఇదే విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని    ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)  ఫిబ్రవరి 10,2020న కన్ఫామ్‌ చేసింది. అంతేకాదు కేంద్ర మినిస్ట్రీ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చైల‍్డ్‌ డెవలప్‌ మెంట్‌ శాఖ అధికారిక సైట్‌ లో పరిశీలించగా.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో 15 మాత్రమే ఉన్నట్లు తేలింది.

దీంతో ప్రధాన్ మంత్రి కన్యా ఆశీర్వాద్ పేరుతో వైరల్ అవుతున్న పోస్ట్   ఫేక్ అని తేలింది. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ ను, పుకార్లను ప్రజలెవ్వరూ నమ్మవద్దు అని విజ్ఞప్తి చేస్తూ పీఐబీ తన ట్విట్టర్ లో పేర్కోంది.