ఫొటోషాప్ ఎఫెక్ట్ : అలలా ఎగిసే ‘ఫ్రైడ్ రైస్’ చూశారా?

సోషల్ మీడియా.. పరిచయం అక్కర్లేని పేరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరిని అడిగిన టక్కున చెప్పేస్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్.. ఇవే ఇప్పుడు ట్రెండింగ్.

  • Published By: sreehari ,Published On : January 29, 2019 / 07:43 AM IST
ఫొటోషాప్ ఎఫెక్ట్ : అలలా ఎగిసే ‘ఫ్రైడ్ రైస్’ చూశారా?

Updated On : January 29, 2019 / 7:43 AM IST

సోషల్ మీడియా.. పరిచయం అక్కర్లేని పేరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరిని అడిగిన టక్కున చెప్పేస్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్.. ఇవే ఇప్పుడు ట్రెండింగ్.

సోషల్ మీడియా.. పరిచయం అక్కర్లేని పేరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరిని అడిగిన టక్కున చెప్పేస్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్.. ఇవే ఇప్పుడు ట్రెండింగ్. ఏదైనా పోస్టు, లేదా ఫొటో, వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తే చాలు.. క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియానే నమ్ముకొని మిలియన్ల కొద్ది బిజినెస్ నడుస్తుందనడంలో సందేహం లేదు. ఒకరోజు సోషల్ మీడియా నిలిచిపోతే.. ఎంత నష్టం వాటిల్లుతుందో మాటల్లో చెప్పలేం. అలాంటి సోషల్ మీడియా.. ప్రపంచాన్నే శాసించే స్థాయికి చేరుకుంది. ఈ ప్లాట్ ఫాంను కొందరు సరదా కోసం వినియోగిస్తే.. మరికొందరు బిజినెస్ కోసం వినియోగిస్తుంటారు. రోజుకో ఎన్నో లక్షల ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అందులో వేలాది ఫొటోలు వైరల్ అవుతుంటాయి.

కొన్నిరోజులుగా ఓ ఫొటో కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. చైనీస్ ఫ్రైడ్ రైస్ అందరికి సుపరిచితమే. ఫ్రైడ్ రైస్ తయారు చేసే సమయంలో పెనంలోని రైస్ ఎలా తిప్పేస్తారో చూసే ఉంటాం. సముద్రంలో అల ఎలా ఉంటుందో.. అచ్చం అలానే పెనంలోని రైస్ కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫొటోకు ఫొటోషాప్ ఎఫెక్ట్ లతో కొంచెం క్రియేటివిటి యాడ్ చేశారు. ఫొటోషాప్ సాయంతో ఈ ఫొటోకు సముద్రపు అల, సీ స్కేటింగ్, బోట్ రైడ్, ఫైర్ ఎఫెక్ట్ ఇలా మరెన్నో ఎఫెక్ట్ లు జోడించడంతో నెటిజన్లను మరింతగా ఆకట్టకుంటున్నాయి. ఈ ఫ్రైడ్ రైస్ ధర 4 డాలర్లే (రూ. 285) మాత్రమేనట. యూ ట్యూబ్ ప్రాంక్ లో దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ప్రాంక్ ఫ్రైడ్ రైస్ కుకింగ్  ఎలా చేస్తున్నాడో చూడండి.. అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.