తన ట్విట్టర్ ఫాలోవర్లకు రూ. 65కోట్లు ఇస్తున్నారు

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 02:07 AM IST
తన ట్విట్టర్ ఫాలోవర్లకు రూ. 65కోట్లు ఇస్తున్నారు

Updated On : January 10, 2020 / 2:07 AM IST

కొంతమంది డబ్బులు లేక ఏడిస్తుంటే.. మరికొందరు ఉన్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియక ఏడుస్తారు. ప్రస్తుతం జపాన్‌ లో ఓ బిలియనీర్ కూడా అదే పని చేస్తున్నాడు. జపాన్‌ ఫ్యాషన్‌ వ్యాపారవేత  యుసాకు మేజావా అనే ఇండస్ర్టీయలిస్ట్‌ సోషల్‌ ఎక్స్‌ పరిమెంట్‌ కు తెరతీశారు.

తన ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ కి అక్షరాల రూ. 65కోట్లను (9 మిలియన్లను) ఇస్తున్నారు. ఫాలోవర్స్‌ లో వెయి మందిని సెలక్ట్‌ చేసిన వారికి ఈ డబ్బులను సమానంగా పంచుతున్నట్టు ప్రకటించారు. యుసాకు  చేసిని ట్విట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

దీంతో నెటిజన్లు అందరూ.. ఆయన ఫాలోవర్స్‌ గా మనమెందుకు లేమా అంటూ తల పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే స్పేస్‌ ఎక్స్‌తో చంద్రుని చుట్టూ ప్రయాణించిన మొట్టమొదటి ప్రైవేట్ ప్రయాణీకుడిగా నిలిచిన మేజావా.. స్పోర్ట్స్‌ కార్ల కోసం తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఖర్చు చేస్తున్నారు.