OMG వీడియో : మనిషి ముఖంతో పుట్టిన ఆవుదూడ

  • Published By: veegamteam ,Published On : September 11, 2019 / 09:08 AM IST
OMG వీడియో :  మనిషి ముఖంతో పుట్టిన ఆవుదూడ

Updated On : September 11, 2019 / 9:08 AM IST

ప్రపంచంలో వింతలకు కొదువ లేదు. కొన్ని వింత గురించి వింటే పోతులూరీ వీరం బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో చెప్పిన విశేషాలు గుర్తుకొస్తాయి. అటువంటి ఓ వింత ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది.  ఒక ఆవుకు పుట్టిన దూడ అచ్చంగా మనిషి ముఖంతో పుట్టింది. దీన్ని చూస్తే కాస్త భయంగానే అనిపిస్తుంది.

ఈ వింత ఆవుదూడ జననం గురించి తెలియటంతో ఆ చుట్టుపక్కలవారంతా దాని కూడటానికి భారీగా తరలివస్తున్నారు. దాన్ని చూసివారంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. దీంతో ఈ ఆవుదూడ విషయం పెద్ద చర్చగా మారిపోయింది. ఈ వింత ఆవుదూడను వీడియో తీసిన కొంతమంది దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అదికాస్తా వైరల్ గా మారింది.

ఈ ఆవుదూడక అచ్చంగా మనిషిలా చిన్న ముక్కు , చెవులు, తల, కళ్లు ఉండటం విశేషం. ఈ విషయంపై పరిశోధించిన స్పెషలిస్ట్ నికోలస్ మాట్లాడుతూ..జన్యుపరమైన మార్పుల వలనే ఇలా పుట్టిందని..డీఎన్ఏ లలో మార్పుల వలనకూడా ఇటువంటివి జరుగుతుంటాయని తెలిపారు. 

ఆవు గర్భంలో ఉన్న సమయంలో దూడ పుర్రె సరిగా ఎదగక పోవడంవలన మనిషిని పోలినట్టుగా ఉందని ఆయన అన్నారు. కాగా..ఈ ఆవుదూడ పుట్టిన కొద్ది సేపటికే చనిపోయిందని ఆవు యజమాని తెలిపారు.