స్కూళ్లలో సినిమా పాటలపై నిషేధం

పాఠశాలల్లో నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాల్లో సినిమా పాటలకు నిషేధం విధించాల్సిందిగా రాష్ట్ర ప్రాథమిక, సెకండరీ విద్యాశాఖలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.. అసభ్యకరమైన పదాలు ఉపయోగించిన పాటలకు... పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసే విద్యార్థుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 19, 2019 / 03:14 AM IST
స్కూళ్లలో సినిమా పాటలపై నిషేధం

పాఠశాలల్లో నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాల్లో సినిమా పాటలకు నిషేధం విధించాల్సిందిగా రాష్ట్ర ప్రాథమిక, సెకండరీ విద్యాశాఖలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.. అసభ్యకరమైన పదాలు ఉపయోగించిన పాటలకు… పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసే విద్యార్థుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్కూళ్లలో సినిమా పాటలపై నిషేధం విధించాలని భావిస్తున్న కర్ణాటక ప్రభుత్వం… అశ్లీల నృత్యాలు, అసభ్య పదజాలం పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నాయనే కారణంగా…స్కూళ్లలో స్వాతంత్య్ర దినోత్సవం జరిగినా, గణతంత్య్ర దినోత్సవం, వార్షిక మహోత్సవం జరిగినా. సినిమా పాటలకు డ్యాన్సులు వేసేందుకు పోటీ పడతారు విద్యార్థులు. అయితే ఇకపై అలాంటివి చెల్లవు. పాఠశాలల్లో నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాల్లో సినిమా పాటలకు నిషేధం విధించాల్సిందిగా రాష్ట్ర ప్రాథమిక, సెకండరీ విద్యాశాఖలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.. అసభ్యకరమైన పదాలు ఉపయోగించిన పాటలకు… పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసే విద్యార్థుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో వాటిని బ్యాన్ చేయాలనే ఆలోచనలు చేస్తోంది సెంట్రల్ గవర్న్‌మెంట్. 

ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో సినిమా పాటలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, కన్నడ రాష్ట్రంలోని పాఠశాలల్లో సినిమా పాటలు వినిపించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. పాఠశాల కార్యక్రమాల్లో సినిమా పాటలకు బదులుగా ఉన్నత విలువలను, దేశభక్తిని పెంపొందించే మంచి సాహిత్యం ఉన్న గేయాలను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోంది కర్ణాటక ప్రభుత్వం.