Viral Video : పుట్టిన వెంటనే చేతులతో ట్రేను పైకి లేపిన శిశువు.. నిజమైన బాహుబలి పుట్టాడంటున్న నెటిజన్లు
అప్పుడే పుట్టిన శిశువు రెండు చేతులతో ఒక ట్రేను పైకి లేపగలడు అంటే నమ్మగలరా? నమ్మి తీరాల్సిందే. ఓ నవజాత శిశువు చేసిన ఫీట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. నిజమైన బాహుబలి పుట్టాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video
Viral Video : అప్పుడే పుట్టిన శిశువుకి శారీరక బలం ఉండదు. కానీ మీరు అనుకున్నది తప్పు అని ఓ వీడియో రుజువు చేస్తోంది. అప్పుడే పుట్టిన ఓ శిశువు రెండు చేతులతో ట్రే పట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. శిశువుని పట్టుకున్న నర్సు, ఆసుపత్రి సిబ్బంది ఆ శిశువుని చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోపై జనం కాస్త సీరియస్ అయ్యారు. నర్సు శిశువు పట్ల ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు. అప్పుడే పుట్టిన ఓ బుడ్డోడు బాహుబలిలా ఓ ట్రేను రెండు చేతులతో పట్టుకుని మోయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజమైన బాహుబలి పుట్టాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. @bhakttrilokika ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఒక నర్సు శిశువును తలక్రిందులుగా పట్టుకున్నట్లు కనిపిస్తుంది. శిశువు ట్రేను రెండు చేతులతో పట్టుకుని పైకి లేపింది. ఇది చూసిన వారంతా నోరెళ్లబెట్టారు. వీడియో టెక్ట్స్‌లో ‘5G లాంచ్ బాయ్’ అని ఉంది. నర్సులో ఒకరు చిన్నారిని చూసి ‘శక్తిమాన్’ అని కూడా పిలవడం వినపడుతుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఈ వీడియో శీర్షికలో ‘చంద్రయాన్ చంద్రునిపైకి చేరిన వెంటనే భారతదేశంలో నిజమైన బాహుబలి పుట్టాడు’ అని షేర్ చేశారు. ఇక నర్సు శిశువును తలక్రిందులుగా పట్టుకుని అందరికీ చూపించడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆమె ఎవరో కానీ వెంటనే జైలుకి పంపండి. ఇది అమానవీయం’ అని.. శిశువును ఉద్దేశించి ‘నిజంగా ఈ పిల్లాడు శక్తిమాన్ అయి ఉండాలని’ ట్వీట్ చేశారు.
*चन्द्रयान के चन्द्रमा पर पहुँचते ही भारत में जन्मा Real “बाहुबली”* ???? pic.twitter.com/KGHQlowtqJ
— तिवारी दद्दा ? (@bhakttrilokika) August 24, 2023