బతికితే చాలు అనుకున్న గద్ద.. వైరల్ వీడియో

గద్దలు ఆహారం కోసం మాత్రం సముద్రంలో వెతుకుతుంటాయిని అందరికి తెలిసిన విషయమే. సముద్రంలో దోరికే చేపలను,పాములను తింటు ఉంటాయి. తాజాగా అమెరికాలోని వాంకోవర్ దీవుల్లో మాత్రం ఆక్టోపస్ చేతికి చిక్కిన గద్ద వీడియో వైరల్ గా మారింది. ఆహారం కోసమని వెతుకుతు నీటిలోకి దిగిన గద్దను మాత్రం ఆక్టోపస్ వచ్చి గట్టిగా బంధించింది. ఆక్టోపస్ నుంచి విడిప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నించింది.
ఆక్టోపస్ గట్టిగా పడుకోవడంతో ప్రయత్నం ఫలించక, గద్ద గట్టిగా అరుస్తుంది. దాంతో సరిగ్గా అదే సమయానికి చేపలను పెంచే సాల్మన్ బృందం అటువైపుగా వెళ్తుండగా గద్ద అరుపులు విని, అక్కడకు చేరుకున్నాయి. ఏదో విధంగా గద్దను కాపాడాలని నిర్ణయించుకున్నారు.
ఆ ప్రయత్నంలో పడవలో ఉన్న వ్యక్తి ఒక కర్రకు హుక్ ను తగిలించి,ఆక్టోపస్ ను కదిలించే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా ఆక్టోపస్ తన పట్టును విడవడంతో చివరికి గద్దను వదిలిపెట్టింది. దాంతో గద్ద తను ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంటు పక్కనే ఉన్న ఒడ్డుకు చేరింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, గద్దను కాపాడిన బృందాన్నిఅభినందిస్తు లైక్ లు, షేర్లతో వీడియో వైరల్ గా మారింది.