నిదానంగా కదులుతున్న తుఫాన్ : ఒరిస్సా వైపు పయనం : ఉత్తరాంధ్రకు ఎఫెక్ట్

  • Published By: vamsi ,Published On : April 29, 2019 / 08:07 AM IST
నిదానంగా కదులుతున్న తుఫాన్ : ఒరిస్సా వైపు పయనం : ఉత్తరాంధ్రకు ఎఫెక్ట్

Updated On : April 29, 2019 / 8:07 AM IST

బంగాళాఖాతంలోని తీవ్ర తుఫాన్ దిశ మార్చుకుంటోంది. ఒరిస్సా వైపు కదులుతుంది. ప్రస్తుతం శ్రీలంకకు 840 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యి ఉంది. ఇది గంటకు కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇదే స్పీడ్ తో కదిలితే మాత్రం మే తీరం దాటాలంటే మే 3వ తేదీ అవుతుందని అంచనా వేస్తున్నారు. స్పీడ్ పెరిగితే మాత్రం మే 2వ తేదీ సాయంత్రానికే తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
ఒరిస్సా వైపు కదులుతున్న తీరం దాటనున్నట్లు అంచనా వేస్తుండటంతో.. ఇప్పుడు ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఉండనుంది. మే 30వ తేదీ సాయంత్రం నుంచి వర్షాలు పడనున్నట్లు చెబుతున్నారు అధికారులు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ వానలు కురుస్తాయి. కేరళ స్టేట్ లోని ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం, వాయనాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలతోపాటు కొండ చరియలు విరిగి పడనున్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ.