Cyclone Fengal : బలహీనపడిన ఫెంగాల్ తుపాను.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..!
రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాలు అతలాకుతలమైన పరిస్థితి ఉంది.

Cyclone Fengal (Photo Credit : Google)
Cyclone Fengal : ఫెంగాల్ తుపాను బలహీనపడింది. వాయుగుండంగా మారింది. రానున్న 6 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ఫెంగల్ తుపాను బలహీనపడినప్పటికీ.. రాష్ట్రానికి వర్ష సూచన కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఫెంగాల్ తుపాను పుదుచ్చేరి సమీపంలో బలహీనపడిన తర్వాత తీవ్ర వాయుగుండంగా మారింది. ఆ తర్వాత తీవ్ర వాయుగుండం కూడా బలహీన పడి ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.
ఏపీ విషయానికి వస్తే దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల చెదురుముదురు వానలు, పలు చోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన చేసింది. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాలు అతలాకుతలమైన పరిస్థితి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పూర్తి వివరాలు..
Also Read : దటీజ్ పవన్ కల్యాణ్..! ఢిల్లీ నుంచి గల్లీ వరకు సేనాని దూకుడు, దేశం కళ్లన్నీ పవన్ వైపే..!