Viral Video: రహదారిపై కారును ఢీ కొట్టబోయిన హెలికాప్టర్.. జస్ట్ మిస్..

హైవే పై నుంచి కార్ల పక్క నుంచే ఓ హెలికాప్టర్ వెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. రష్యాతో యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ లోని ఓ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రక్షణ శాఖే ఈ వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం. రోడ్డుకి కొన్ని అడుగుల పై నుంచే సైనిక హెలికాప్టర్ వెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఆ హెలికాప్టర్ కి ఎదురుగా వచ్చిన ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు.

Viral Video: రహదారిపై కారును ఢీ కొట్టబోయిన హెలికాప్టర్.. జస్ట్ మిస్..

Viral Video: హైవే పై నుంచి కార్ల పక్క నుంచే ఓ హెలికాప్టర్ వెళ్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. రష్యాతో యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్ లోని ఓ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రక్షణ శాఖే ఈ వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం. రోడ్డుకి కొన్ని అడుగుల పై నుంచే సైనిక హెలికాప్టర్ వెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఆ హెలికాప్టర్ కి ఎదురుగా వచ్చిన ఓ కారులోని వ్యక్తి వీడియో తీశాడు.

కారుకి దగ్గరగా హెలికాప్టర్ వచ్చి ఒక్క సారిగా పక్కకు తప్పుకుంది. హెలికాప్టర్ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోడ్డు వద్దకు హెలికాప్టర్ రావడం పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..