Viral Video: అమ్మకానికి పెట్టిన దీపాలను కర్రతో ధ్వంసం చేసిన యువతి

ఓ యువతి కర్రతో దీపాలు, కుండలను పగులకొట్టింది. ఆమె ఇంటి ముందు దీపాలను అమ్ముతుండడమే అందుకు కారణం. ఉత్తరప్రదేశ్ లోని పత్రకార్పురంలోని గోమతీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి దీపాలను పగులకొడుతున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీపావళి నాడు దీపాలు విక్రయించేందుకు ఓ వ్యక్తి రోడ్డు పక్కన తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు.

Viral Video: అమ్మకానికి పెట్టిన దీపాలను కర్రతో ధ్వంసం చేసిన యువతి

Viral Video: ఓ యువతి కర్రతో దీపాలు, కుండలను పగులకొట్టింది. ఆమె ఇంటి ముందు దీపాలను అమ్ముతుండడమే అందుకు కారణం. ఉత్తరప్రదేశ్ లోని పత్రకార్పురంలోని గోమతీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువతి దీపాలను పగులకొడుతున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీపావళి నాడు దీపాలు విక్రయించేందుకు ఓ వ్యక్తి రోడ్డు పక్కన తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు.

అయితే, తన ఇంటి ముందు ఎందుకు అమ్ముతున్నారని ఆ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దీపాలు, కుండలపై నీళ్లు కూడా పోసినట్లు తెలిసింది. అనంతరం ఓ కర్ర పట్టుకువచ్చి అందరూ చూస్తుండగానే దీపాలను పగులకొట్టి వెళ్లిపోయింది. అక్కడ ప్రతి ఏడాది దీపావళి నాడు దీపాలను అమ్ముతుంటామని ఆ దుకాణ నిర్వాహకులు చెప్పారు. ఆ యువతి ప్రవర్తించిన తీరుపై వర్తకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ యువతి ఓ మాజీ ఐఏఎస్ అధికారి కుమార్తె. ఆమె ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..