Jairam Ramesh: కొవిడ్‌ను రాజకీయం చేసిన కేంద్రం, అందుకే గైడ్‌లైన్స్ లేవు.. జైరాం విమర్శలు
కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 అంటూ హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వం, నాలుగు రోజులు పోయాక ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. ఇక కొవిడ్ నిబంధనలు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి అలాంటివి రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొవిడ్‌ను కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు

Jairam Ramesh: కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 అంటూ హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వం, నాలుగు రోజులు పోయాక ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. ఇక కొవిడ్ నిబంధనలు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి అలాంటివి రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొవిడ్‌ను కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. వాస్తవానికి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఆ మధ్య బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్రను చూసి బీజేపీ భయపడుతోందని అప్పుడే కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మరోసారి విమర్శలు గుప్పించారు జైరాం.
Bharat Jodo Yatra: ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ హెచ్చరిక
‘‘భారత్ జోడో యాత్ర ఆపడానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే ఈ యాత్ర ద్వారా దేశ ప్రజలంతా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజల్లో రాహుల్‌కు విశేష ఆదరణ వస్తోంది. ఇది చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది. తమ పీఠాలు కూలిపోతాయని భయపడుతోంది. అందుకే యాత్రను ఆపడం కోసం కొవిడ్ అంటూ హడావుడి చేసింది. కొవిడ్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసింది. ఒక వేళ నిజంగానే కొవిడ్ వస్తే ఎందుకు ఇప్పటి వరకు నిబంధనలు విడుదల చేయలేదు?’’ అని జైరాం రమేశ్ ప్రశ్నించారు.
Rajasthan: కాంగ్రస్ పార్టీని కలవరపెడుతున్న సచిన్ పైలట్ సోలో క్యాంపెయిన్స్