Pakistan-Afghan: పాక్-అఫ్గాన్ సరిహద్దుల వద్ద కాల్పులు.. ఏడుగురి మృతి.. 27 మందికి గాయాలు

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల వద్ద కలకలం చెలరేగింది. అక్కడ జరిగిన కాల్పుల్లో ఆరుగురు పాకిస్థాన్ పౌరులు, ఓ అఫ్గాన్ సైనికుడు మృతి చెందారు. అంతేగాక, మరో 27 మందికి గాయాలయ్యాయి. వారిలో పాకిస్థాన్ కు చెందిన వారు 17 మంది ఉన్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఓ ప్రకటనలో తెలిపింది. సరిహద్దుల విషయంలో పాకిస్థాన్-అఫ్గాన్ మధ్య చాలా కాలంగా ఘర్షణలు చెలరేగుతున్నాయి.

Pakistan-Afghan: పాక్-అఫ్గాన్ సరిహద్దుల వద్ద కాల్పులు.. ఏడుగురి మృతి.. 27 మందికి గాయాలు

Pakistan-Afghan

Pakistan-Afghan: పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల వద్ద కలకలం చెలరేగింది. అక్కడ జరిగిన కాల్పుల్లో ఆరుగురు పాకిస్థాన్ పౌరులు, ఓ అఫ్గాన్ సైనికుడు మృతి చెందారు. అంతేగాక, మరో 27 మందికి గాయాలయ్యాయి. వారిలో పాకిస్థాన్ కు చెందిన వారు 17 మంది ఉన్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఓ ప్రకటనలో తెలిపింది. సరిహద్దుల విషయంలో పాకిస్థాన్-అఫ్గాన్ మధ్య చాలా కాలంగా ఘర్షణలు చెలరేగుతున్నాయి.

సరిహద్దుల వద్ద అఫ్గాన్ సైనికులు చెక్ పోస్ట్ నిర్మిస్తుండడంతో దాన్ని ఆపేయాలని పాకిస్థాన్ ఆర్మీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే చమన్ క్రాసింగ్ బార్డర్ వద్ద అఫ్గాన్ సైనికులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపినట్లు పాక్ ఆర్మీ చెప్పింది. అఫ్గాన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడింది.

దీనిపై అఫ్గాన్ పోలీసులు స్పందిస్తూ తమ దేశ సైనికుడు ఒకరు మృతి చెందారని, మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సరిహద్దుల వద్ద పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఇరు దేశాల సైనికులు చర్చలు జరిపారని చెప్పారు. చమన్ క్రాసింగ్ బార్డర్ వద్ద నెల రోజు క్రితం కూడా కాల్పులు చోటుచేసుకోవడంతో దాన్ని కొన్ని రోజుల పాటు మూసేశారు. ఆ ఘటన మరవక ముందే మళ్ళీ పెద్ద ఎత్తున కాల్పులు జరగడం గమనార్హం.

Bengaluru couple: అర్ధరాత్రి పూట జంట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నందుకు రూ.1,000 తీసుకున్న పోలీసులు