UFO Shot Down: భూమిపైకి దూసుకొస్తున్న గ్రహాంతర నౌకను రష్యా కూల్చేసిందా? ఆ వీడియో నిజమేనా?

ఒక యూఎఫ్ఓ (గ్రహాంతర నౌక)ను రష్యా సైన్యం కూల్చేసిందనే వార్త సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రష్యన్ మీడియా కూడా అనేక కథనాల్ని ప్రసారం చేస్తోంది. రష్యన్ మీడియా కథనం ప్రకారం.. రష్యాలోని రోస్తోవ్ ప్రాంతంలో, ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెలియని వాహనాన్ని రష్యా వైమానిక దళం కూల్చేసింది.

UFO Shot Down: భూమిపైకి దూసుకొస్తున్న గ్రహాంతర నౌకను రష్యా కూల్చేసిందా? ఆ వీడియో నిజమేనా?

UFO Shot Down: గ్రహాంతర వాసుల ఉనికిపై ఇప్పటికీ సందేహాలే. గ్రహాంతర వాసులు, గ్రహాంతర నౌకల విషయంలో భిన్న వాదనలు వినిపిస్తుంటాయి. కొందరు తాము వాటిని చూశామని చెబుతుంటారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి.

Mid-Day Meals: మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్.. వారానికోసారి చికెన్, గుడ్లు, పండ్లు ఇవ్వనున్న బెంగాల్ ప్రభుత్వం

తాజాగా ఒక యూఎఫ్ఓ (గ్రహాంతర నౌక)ను రష్యా సైన్యం కూల్చేసిందనే వార్త సంచలనం రేపుతోంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రష్యన్ మీడియా కూడా అనేక కథనాల్ని ప్రసారం చేస్తోంది. రష్యన్ మీడియా కథనం ప్రకారం.. రష్యాలోని రోస్తోవ్ ప్రాంతంలో, ఆకాశంలో ఎగురుతున్న గుర్తు తెలియని వాహనాన్ని రష్యా వైమానిక దళం కూల్చేసింది. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 3న రాత్రి ఈ ఘటన జరిగింది. ఆకాశంలో ఏదో గుర్తు తెలియని వాహనం లాంటిది ఎగురుతూ, భూమిపైకి వస్తుండటాన్ని రష్యా సైన్యం గుర్తించింది. ఈ వాహనం మెరుస్తూ భూమిపైకి చేరుకుంటోంది. అయితే, రష్యా వైమానిక దళం వెంటనే స్పందించి మిస్సైల్స్ ప్రయోగించి, దీన్ని పేల్చివేసింది.

Bird Flies: ఆగకుండా 13 వేల కిలోమీటర్లు ప్రయాణించిన పక్షి.. సరికొత్త రికార్డు సృష్టించిన గాడ్విట్

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం అక్కడి మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూలిపోయిన ఈ వాహనం బంతిలాగా, గుండ్రంగా ఉందని స్థానిక మీడియా తెలిపింది. ఇది గ్రహాంతర నౌకనే అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో వీడియో విషయంలో పలువురు సందేహాలు లేవనెత్తుతున్నారు.