Viral Video: రోడ్డు పక్కన స్టాల్‌లో స్వయంగా ఛాయ్ తయారు చేసిన ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా రోడ్డు పక్కన స్టాల్‌లో టీ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన కృష్ణనగర్ లోక్ సభ నియోజక వర్గంలో మహువా మొయిత్రా పర్యటిస్తూ ఓ టీ స్టాల్ వద్ద ఆగి తేనీరు తయారు చేశారు. టీలో ఆమె చక్కెర వేస్తుండడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆమె తయారు చేసిన టీ తాగేందుకు చాలా మంది ఆసక్తి చూపారు.

Viral Video: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా రోడ్డు పక్కన స్టాల్‌లో టీ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన కృష్ణనగర్ లోక్ సభ నియోజక వర్గంలో మహువా మొయిత్రా పర్యటిస్తూ ఓ టీ స్టాల్ వద్ద ఆగి తేనీరు తయారు చేశారు. టీలో ఆమె చక్కెర వేస్తుండడం ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆమె తయారు చేసిన టీ తాగేందుకు చాలా మంది ఆసక్తి చూపారు.
‘‘ఛాయి చేతులతో టీ తయారు చేయడానికి ప్రయత్నించాను. నన్ను విధి ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవరికి తెలుసు?’’ అని మహువా మొయిత్రా ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన కొత్త పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంపీ మహువా మొయిత్రా నిన్న కృష్ణనగర్ లోక్ సభ నియోజక వర్గంలో పర్యటించారు.
ఈ సందర్భంగానే పలు ప్రాంతాల్లో ప్రజలతో ముచ్చటించారు. గతంలో మమతా బెనర్జీ కూడా ఇలాగే ప్రజలతో మమేకం అవుతూ పలు ఆహార పదార్థాలు వండిన విషయం తెలిసిందే. అప్పట్లో మమతా బెనర్జీ రోడ్డు పక్కన దాకాణుదారులతో ముచ్చటిస్తూ ఆహార పదార్థాలు స్వయంగా తయారు చేసి, అక్కడి వారికి ఇచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా మహువా మొయిత్రా పోస్ట్ చేసిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Tried my hand at making chai… who knows where it may lead me 🙂 pic.twitter.com/iAQxgw61M0
— Mahua Moitra (@MahuaMoitra) January 11, 2023
NTR : వెరైటీ మ్యాగజైన్ విలేకరికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన ఎన్టీఆర్..