ఏపీ కేబినెట్ : రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ

రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 08:07 AM IST
ఏపీ కేబినెట్ : రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ

రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20 తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మూడు రాజధానుల నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 

జనవరి 18 నుంచి 20 వ తేదీ మధ్యలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మూడు రాజధానులపై తుది నిర్ణయం తీసుకోనుంది. హైపవర్ కమిటీలో మంత్రులు, అధికారులు ఉండనున్నారు. జనవరి 14లోపు నివేదిక సమర్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. జనవరి 3న బోస్టన్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 

కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని అంశం చర్చకు వచ్చిందని మంత్రి కన్నబాబు తెలిపారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. బోస్టన్ గ్రూప్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. రెండు నివేదికల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

శుక్రవారం (డిసెంబర్ 27, 2019) ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. సచివాలయంలో రెండు గంటలపాటు సమావేశం సాగింది. బోస్టన్ గ్రూప్ ఇచ్చిన మధ్యంతర నివేదికపై కేబినెట్ ల్ చర్చించారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ సర్వే నివేదికపై కేబినెట్ చర్చించింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రధానంగా ఏపీ రాజధానిని విశాఖపట్నంకు మార్చడంపైనే సమావేశంలో చర్చించారు. 

గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలు, చంద్రబాబు హయాంలోని 30 అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ చేపట్టింది. 4 నెలల విచారణ తర్వాత నివేదిక తయారు చేసింది. గత ప్రభుత్వ అక్రమాలపై సీఎం జగన్ కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక అందజేసింది.