ఇమ్యూనిటీ పెంచే ‘ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ’..రండి బాబూ రండీ..

  • Published By: nagamani ,Published On : August 29, 2020 / 11:44 AM IST
ఇమ్యూనిటీ  పెంచే ‘ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ’..రండి బాబూ రండీ..

ఈ కరోనా కాలంలో కాదేదీ అమ్మకానికి అనర్హంఅన్నట్లుగా ఉంది. ఇది తినండి కరోనా పోతుంది..ఇది తింటే అసలు కరోనాయే రాదంటూ పలు ఫుడ్ వ్యాపారులు ప్రజల్ని ఊదరగొట్టేస్తున్నారు. అటువంటిదే ఈ ‘ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీ’.కరోనా వైరస్ పుణ్యమాని కామారెడ్డి జిల్లాలో ఈ కొత్త రకం ఆయుర్వేదిక్ బిర్యానీ పుట్టుకొచ్చింది.



సాధారణంగా బిర్యానీ అంటే మటన్, చికెన్, ఎగ్ బిర్యానీలు లేదా వెజ్ బిర్యాలే గుర్తుకొస్తాయి. రకరకాల ఫ్లేవర్స్ తో చేసుకుంటుంటాం. కానీ ఈ కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో కొత్త కొత్త ఆలోచనల్లో భాగంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న విషయాన్ని గుర్తెరిగి..బాన్సువాడకు చెందిన ఐస్ ల్యాండ్ హోటల్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించీ..ఈ ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీని తయారు చేస్తున్నారు.

ayurvedic chiken dham biryani in banswada

ఈ బిర్యానీని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని హోటల్ ముందు బోర్డు పెట్టి మరీ అమ్ముతున్నారు. ఈ ఆయుర్వేదిక్ బిర్యానీలో రోగనిరోధక శక్తిని పెంచే దాల్చిన చక్క, మిరియాలు, శొంఠి, లవంగాలు, తులసి పౌడర్, ఉసిరి వంటి ఆయుర్వేదిక్ పదార్థాలను వినియోగిస్తున్నట్టు హోటల్ యజమాని తెలిపారు. ఈ బిర్యాని తినడానికి రుచికరంగా కూడా ఉంటుందని కూడా చెబుతున్నారు.



దీంతో వెరైటీ ఫుడ్ లను బాగా ఎంకరేజ్ చేసే మన తెలుగింటి ప్రజలు లొట్టలేసుకుంటూ ఈ ఆయుర్వేదిక్ చికెన్ ధమ్ బిర్యానీని లాగించేస్తున్నారట. కష్టమర్లు ఆ రెస్టారెంట్ ముందు క్యూ కట్టి మరీ లాగించేస్తున్నారు. బాన్సువాడ నుంచే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ హోటల్ లో బిర్యానీని తీసుకెళ్తున్నారు. ఈ బిర్యానీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://10tv.in/brits-warned-go-back-to-work-or-risk-losing-your-job/

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రజలు హోటల్స్ లో తినాలంటేనే భయపడుతున్నారు. హోట‌ల్ రంగం పూర్తిగా స‌గానికి స‌గం పడిపోయింది. కరోనా సమయంలో ప్రజలు బైటి ఫుడ్ తినటానికే భయపడుతున్న ఈ క్రమంలో ప్ర‌జ‌ల‌ను ఆకర్షించే విధంగా ఆయుర్వేదిక్ చికెన్ బిర్యానీ త‌యారు చేస్తు..కష్టమర్లను ఆకట్టుకుంటున్నారు నిర్వాహకులు. కొంతమంది ఇక్కడికే వచ్చి తింటుంటే మ‌రి కొంద‌రు పార్స‌ిల్స్ తీసుకు వెళ్లుతున్నారు. దీంతో ఐస్ ల్యాండ్ హోటల్ ఆయుర్వేదిక్ బిర్యానికి మంచి డిమాండ్ వచ్చేసింది. కష్టమర్లతో హోటల్ కళకళలాడిపోతోంది.