చంద్రబాబు అత్తకి పదవి ఇచ్చాం : ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్

ఏపీ అసెంబ్లీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన చర్చలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అత్త గురించి ప్రస్తావించారు. చంద్రబాబు తన అత్తకి అన్యాయం

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 10:29 AM IST
చంద్రబాబు అత్తకి పదవి ఇచ్చాం : ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్

ఏపీ అసెంబ్లీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన చర్చలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అత్త గురించి ప్రస్తావించారు. చంద్రబాబు తన అత్తకి అన్యాయం

ఏపీ అసెంబ్లీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన చర్చలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అత్త గురించి ప్రస్తావించారు. చంద్రబాబు తన అత్తకి అన్యాయం చేస్తే.. మేము న్యాయం చేశామన్నారు. 50శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు.

ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ పదవిని నందమూరి లక్ష్మీపార్వతికి ఇచ్చామన్న జగన్.. ఆమె చంద్రబాబు అత్తగారే.. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భార్య అని చెప్పారు. ఆమెకు చంద్రబాబు పదవి ఇవ్వలేదు… కానీ మేము ఇచ్చాం అని జగన్ అనగానే.. చంద్రబాబు సహా మిగతా సభ్యులంతా నవ్వుకున్నారు. గతంలో నామినేటెడ్ పదవుల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరుపై జగన్ మండిపడ్డారు. వక్రీకరించే విషయంలో చంద్రబాబుని మించిన నాయకుడు మరొకరు దేశంలో లేరన్నారు. 

అత్తగారిని అన్యాయంగా మీరు వదిలేసినా.. మేము న్యాయం చేశామని జగన్ అన్నారు. మా కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలు ఉన్నారని జగన్ చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు. నామినేటెడ్ పదవులతో నీచమైన రాజకీయాలు చేసిన ఘనత టీడీపీది అని జగన్ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన నామినేటేడ్ పదవులను కూడా భర్తీ చేస్తామన్నారు.