వైసీపీ నేతకు షాక్.. శ్రీకాకుళం జిల్లాలో రూ.3కోట్లు స్వాధీనం

  • Published By: vamsi ,Published On : April 5, 2019 / 08:09 AM IST
వైసీపీ నేతకు షాక్.. శ్రీకాకుళం జిల్లాలో రూ.3కోట్లు స్వాధీనం

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలవేళ నోట్లు దొరకడం కలకలం సృష్టిస్తుంది. మూడు బ్యాగుల్లో భారీగా డబ్బు పట్టుబడడంతో స్థానికంగా గందరగోళం సృష్టిస్తుంది. విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం వస్తున్న ఆర్టీసీ బస్సులో బొద్దాం వద్ద పోలీసులు బ్యాగుల్లో భారీగా నగదును పట్టుకున్నారు. బస్సు దిగువ భాగంలోని లగేజీ క్యాబిన్‌లో మూడు లగేజీ బ్యాగులలో నోట్ల కట్టలు ఉన్నట్లు రాజాం సీఐ గంట వేణుగోపాల్‌ వెల్లడించారు.
Read Also : అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్

బస్సుతో సహా 23 మంది ప్రయాణికులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు. రెవెన్యూ అధికారులకు, ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు పోలీపసులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న అధికారులు.. కౌంటింగ్ మిషన్‌లతో డబ్బును లెక్కిస్తున్నారు. రూ.2కోట్లకు పైగా ఇప్పటికే లెక్కించగా.. రూ.3కోట్ల వరకు ఈ డబ్బు ఉండవచ్చునని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన వైసీపీ నేత డబ్బుగా దీనిని గుర్తించారు.

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోదరుడు విక్రాంత్ కూడా బస్సులో ఉండడంతో విచారణ చేపట్టారు. అయితే డబ్బు తనది కాదు అని విక్రాంత్ చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
Read Also : పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు