బాబుది మద్యం తాగు..తాగించు పాలసీ..జగన్‌ది మాను మాన్పించు పాలసీ 

  • Edited By: veegamteam , December 16, 2019 / 05:26 AM IST
బాబుది మద్యం తాగు..తాగించు పాలసీ..జగన్‌ది మాను మాన్పించు పాలసీ 

మాజీ సీఎం చంద్రబాబుది మద్యం తాగు..తాగించు పాలసీ అని..సీఎం జగన్ ది మద్యం మాను..మాన్పించు పాలసీ అని  ఎక్సైజ్‌ శాఖామంత్రి నారాయణ స్వామి అన్నారు. ఏపీ అసెంబ్లీలో మద్యనిషేదంపై చర్చ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ..జగన్ సీఎం అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించేలా పలు చర్యలు తీసుకున్నారనీ..విడతలవారీగా బెల్ట్ షాపులకు బంద్ చేస్తున్నారనీ తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సయమంలో రాష్ట్రంలో మద్యం ఏరులైపారిందనీ విమర్శించారు.

అటువంటి టీడీపీకి మద్య నిషేధంపై మాట్లాడే హక్కులేదన్నారు. మా ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామని అంటుంటూ టీడీపీకీ ఎందుకంత కడుపు మంట? అని ప్రశ్నించారు. ప్రజల బాగు కోసం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనీ..దాన్ని టీడీపీ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

మద్య నిషేదం అములు చేయాలో వద్దో అనే విషయం వదిలేసి ప్రతిపక్ష నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారనీ అన్నారు. ప్రభుత్వం మద్యనిషేధం విషయంలో టీడీపీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనీ..వచ్చే నాలుగేళ్లలో పూర్తిస్థాయిలో మద్యనిషేధం అమలు చేస్తామని మంత్రి నారాయణ స్వామి ఈ సందర్భంగా స్పష్టంచేశారు.