భారత్ లో గాడిద పాల డెయిరీ..లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

  • Published By: nagamani ,Published On : August 10, 2020 / 04:26 PM IST
భారత్ లో గాడిద పాల డెయిరీ..లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

‘‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు’’ అనే పద్యం గుర్తుంది కదూ. గాడిద పాలు కడవ నిండా ఉన్నా ఏంటి ఫలితం అదే ఆవుపాటు గరిటె అయినా ఉపయోగం అని దాని అర్తం. కానీ ఇప్పడు గాడిదపాలకు కూడా మంచి గిరాకీ రానుంది హర్యానా రాష్ట్రంలో. గాడిద పాల డైరీ ప్రారంభం కానుంది.



ఇప్పటి వరకూ గేదె..ఆవు..పాలు అమ్ముకోవటం గురించి తెలుసు..ఒంటెపాలు కూడా లీటరు రూ.600లకు అమ్మటం గురించి కూడా విన్నాం. కానీ గాడిద పాలు అమ్మకం ఏంటీ..అదికూడా గాడిద పాల కోసం డైరీలు. వినటానికి ఆశ్చర్యంగా ఉందికదూ..ఇంకా ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే..గాడిద పాల ఖరీదు రూ.7 వేలు…!!

హర్యాణాలోని హిస్సార్ లో ఉన్న నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్ లో ఈ డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. దీని కోసం 10 హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఈ గాడిదలు గుజరాత్ లో ఉంటాయి. వీటి పాలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో గాడిద పాలకు ఏ పాలు సాటి రావట. చిన్న పిల్లలకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు. ఎన్నో జబ్బులకు గాడిద పాలు ఔషధంగా పని చేస్తాయని నిపుణులు సైతం చెబుతున్నారు.

హలారి గాడిదలకు చాలా డిమాండ్ ఉంది. వీటి పాల ధర లీటర్ కు రూ. 7 వేల వరకు ఉంటుంది. అలర్జీ, ఉబ్బసం, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ గాడిదల పాలు తోడ్పడతాయి. ఈ నేపథ్యంలోనే గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. తొలుత గాడిదల బ్రీడింగ్ జరుగుతుందని… ఆ తర్వాత డెయిరీ పనులు మొదలవుతాయని జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం తెలిపింది.



ఈ సందర్భంగా రీసర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ… ఆవు, గేదె పాల ద్వారా చిన్న పిల్లలు అప్పుడప్పుడు అలర్జీల బారిన పడుతుంటారని… కానీ హలారి బ్రీడ్ గాడిదల పాలతో ఎలాంటి అలర్జీలు రావని చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్లు ఈ పాలలో ఉంటాయని తెలిపారు. గతంలో త్రిపాఠి ఆధ్వర్యంలోనే గాడిద పాలపై రీసర్స్ ప్రారంభమైంది.