కొలిక్కిరాని రాయపాటి గోల : బుజ్జగింపుల్లో టీడీపీ

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 01:51 PM IST
కొలిక్కిరాని రాయపాటి గోల : బుజ్జగింపుల్లో టీడీపీ

ఎన్నికలకు నామినేషన్ల పర్వం స్టార్ అయిపోయింది. TDPలో మాత్రం సీట్ల కేటాయింపు కొలిక్కి రాలేదు. నరసరావుపేట పార్లమెంట్ విషయంలో టీడీపీ తర్జనభర్జనలు పడుతోంది. రాయపాటి సాంబశివరావు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆఖరి నిమిషంలో ఆ ప్రతిపాదనను టీడీపీ విరమించుకుంది.
Read Also : జైలుకెళ్లను బిడ్డో : ఒకేసారి రూ.462 కోట్లు కట్టిన అంబానీ

వృద్దాప్యం కారణంగా రాయపాటి ఏ మేరకు నెట్టుకు రాగాలరనే అనుమానంలో ఉంది టీడీపీ. రాయపాటి ఫ్యామిలీకి గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ సీటు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచిస్తోంది టీడీపీ. గుంటూరు వెస్ట్ నుంచి రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు పేరు ఖరారయ్యే ఛాన్స్‌లున్నాయి.

ఇది ఒకే అయితే.. ఇక్కడి అభ్యర్థి మద్దాల గిరిని నరసరావుపేటకు లేదా మరో నియోజకవర్గానికి పంపించాలనే ఆలోచన చేస్తోంది పార్టీ. నరసరావుపేట, తెనాలి అసెంబ్లీ స్థానాలకు మద్దాలి పేరును నేతలు ప్రతిపాదిస్తున్నారు. అయితే గుంటూరు వెస్ట్ సీటును వదుకోవడానికి మద్దాలి గిరి ఇష్టపడడం లేదు. నరసరావుపేట ఎంపీ స్థానానికి భాష్యం రామకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న అనంతరం స్క్రీనింగ్ కమిటీతో భేటీ కానున్నారు. పెండింగ్‌లో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అసంతృప్తులు రాకుండా రాయపాటిని బుజ్జగించి.. ఆయన డిమాండ్లను నెరవేర్చుతారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.