జర్మనీకి ఏపీ బెండకాయలు

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలేకాకుండా వారికి లాభాలు వచ్చేందుకు..రైతులకు ప్రోత్సాహం అందించేదుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో  సీఎం చంద్రబాబు సూచనలు మేరకు ఏపీలోని ఉత్తరాంధ్రా ప్రాంతమైన విజయనగరం,ప్రకాశంలకు చెందిన    శివకుమార్ రాజు, ఇందువీర్‌లు  సేంద్రియ పద్ధతిలో పండించిన బెండకాయలను జర్మనీకి ఎగుమతి చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 03:55 AM IST
జర్మనీకి ఏపీ బెండకాయలు

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలేకాకుండా వారికి లాభాలు వచ్చేందుకు..రైతులకు ప్రోత్సాహం అందించేదుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో  సీఎం చంద్రబాబు సూచనలు మేరకు ఏపీలోని ఉత్తరాంధ్రా ప్రాంతమైన విజయనగరం,ప్రకాశంలకు చెందిన    శివకుమార్ రాజు, ఇందువీర్‌లు  సేంద్రియ పద్ధతిలో పండించిన బెండకాయలను జర్మనీకి ఎగుమతి చేస్తున్నారు.

విజయనగరం : రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలేకాకుండా వారికి లాభాలు వచ్చేందుకు..రైతులకు ప్రోత్సాహం అందించేదుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో  సీఎం చంద్రబాబు సూచనలు మేరకు ఏపీలోని ఉత్తరాంధ్రా ప్రాంతమైన విజయనగరం,ప్రకాశంలకు చెందిన    శివకుమార్ రాజు, ఇందువీర్‌లు  సేంద్రియ పద్ధతిలో పండించిన బెండకాయలను జర్మనీకి ఎగుమతి చేస్తున్నారు.  ఈ క్రమంలో ఏపీలో పండించి పంటలను విదేశాలకుఎక్స్ పోర్ట్ చేసేందుకు ఉద్యానశాఖ అధికారులు చర్యల్లో భాగంగా..నూజివీడులోని చీడపీడల నియంత్రణ కేంద్రంలో కూరగాయలను  శుద్ధి చేసి..అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌కు ఎగుమతి కార్యక్రమాన్నిఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి ఎగుమతుల కార్యక్రమాన్ని జనవరి 4న ప్రారంభించారు. ఐటీసీ, గుంటూరులోని విన్టూ ప్రయోగ కేంద్రాల్లో 160 రకాల రసాయన పరీక్షలు నిర్వహించి..అన్ని పరీక్షల్లో ఈ బెండకాయలకు ఎగుమతికి కావాల్సిన  అర్హత సాధించాయని..వీటిలో రసాయన అవశేషాలు 0.05 కంటే తక్కువ ఉంటేనే ఎగుమతులకు అనుమతి లభిస్తుందన్నారు. దీంతో జీఎంఆర్‌ కార్గోలో హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాల ద్వారా వీటిని ఎగుమతి చేస్తున్నట్టు చేస్తున్నామని చిరంజీవి చౌదరి తెలిపారు. 

త్వరలోనే గన్నవరం నుంచి కూడా ఎగుమతి చేస్తామని తెలిపారు. ప్రకాశం రైతుకు చెందిన రైతు ఇందువీర్‌ వి  760 కిలోలు, విజయనగరం రైతు శివకుమార్ రాజువి  600 కిలోల బెండకాయలను నూజివీడు తరలించగా, వాటిలో 1000 కిలోలు తొలి విడతగా ఎగుమతి చేసినట్టు కమిషనర్ తెలిపారు. అంతేకాదు సేందీయ ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా గుంటూరు జిల్లాలో 15 వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.