షాక్ కొట్టిన కరెంట్ బిల్ : వందల్లో బిల్లుకు వేలల్లో జీఎస్టీ

జీఎస్టీ ప్రజల పాలిట భారంగా మారుతోంది. కరెంట్ బిల్ వందల్లో వస్తే జీఎస్టీ మాత్రం వేలల్లో కట్టాలని బిల్ వచ్చేసరికి బేర్ మన్నాడు సరదరు వ్యక్తి.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 05:32 AM IST
షాక్ కొట్టిన కరెంట్ బిల్ : వందల్లో బిల్లుకు వేలల్లో జీఎస్టీ

జీఎస్టీ ప్రజల పాలిట భారంగా మారుతోంది. కరెంట్ బిల్ వందల్లో వస్తే జీఎస్టీ మాత్రం వేలల్లో కట్టాలని బిల్ వచ్చేసరికి బేర్ మన్నాడు సరదరు వ్యక్తి.

జీఎస్టీ ప్రజల పాలిట భారంగా మారుతోంది. కరెంట్ బిల్ వందల్లో వస్తే జీఎస్టీ మాత్రం వేలల్లో కట్టాలని బిల్ వచ్చేసరికి బేర్ మన్నాడు సరదరు వ్యక్తి. కరెంట్ బిల్ రూ.రూ.523..వస్తే దానికి జీఎస్టీ, డీసీ కలిపి రూ.4,432లు వచ్చింది. దీంతో అతని గుండె గుభేలుమంది. ఇదేంటని విద్యుత్ అధికారులను అడిగితే కట్టాల్సిందేనని చెప్పడంతో లబోదిబోమంటున్నాడు.
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ

సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం చిన్ననెమిల క్రాస్‌రోడ్డుకు చెందిన వెంకన్న సర్వీస్‌ నెం.4200400310 నంబర్ గల డిజిటల్‌ విద్యుత్ మీటర్‌ అమర్చారు. తరువాత కూల్‌డ్రింక్‌ షాప్ పెట్టుకున్నాడు. దీంతో మీటర్ కనెక్షన్ కేటగిరీ-2లోకి అంటే కమర్షియల్ కు మారింది. ఆ తరువాత దుకాణం తీసేసినా అది కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ లో 54 యూనిట్లు విద్యుత్‌ వాడగా..బిల్లు రూ.523, డెవల్‌పమెంట్‌ చార్జీ, జీఎస్టీ కింద రూ.4,432 అదనంగా వచ్చింది.

ఇదేంటని అధికారులను ప్రశ్నించగా, జీఎస్టీ పడిందని, బిల్లు చెల్లించాల్సిందేనని చెప్పడంతో వెంకన్న హడలిపోతున్నాడు. కాగా కొత్త మీటర్‌కు డెవల్‌పమెంట్‌ చార్జీ వస్తుందని, మీటర్‌ బిగించిన నాటి నుంచి జీఎస్టీ అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఐదేళ్లక్రితం బిగించిన మీటర్‌కు ఇప్పుడు డెవల్‌పమెంట్‌ చార్జీ, జీఎస్టీ ఒకేసారి వసూలు చేయడమేంటని వెంకన్న ఆవేదన చెందుతున్నాడు.
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి