మీకేంటో తెలుసుకోండి: 96 హామీలతో జనసేన మేనిఫెస్టో

  • Published By: vamsi ,Published On : April 3, 2019 / 06:01 AM IST
మీకేంటో తెలుసుకోండి: 96 హామీలతో జనసేన మేనిఫెస్టో

పోలింగ్ తేదీ వచ్చేస్తుంది. ఈ క్రమంలో నేతలు ఎన్నికలకు సం బంధించి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఏపి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 96హామీలు, 7 సిద్ధాంతాలతో జనసేన పవన్ కళ్యాణ్.. మేనిఫెస్టోని విడుదల  చేశారు.

జనసేన మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు: 

రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం,
60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్‌,
రాయల సీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు,
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, 
ఇంటర్మీడియట్‌ విద్యార్థులందరికీ లాప్‌టాప్‌లు పంపిణీ,
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా, 
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు,
గృహిణులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు,
రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ.

పవన్‌ ఇంతకుముందే ప్రకటించినట్లుగా ఉద్యోగుల సీపీఎస్‌ రద్దు వంటి అంశాలను జనసేన మేనిఫెస్టోలో పొందుపరిచారు.