కాఫీ తోటల్లో గో హత్యలు: అరటిపండ్లలో విషం పెట్టి 20 ఆవుల్ని చంపి గోతిలో పడేశారు

  • Published By: nagamani ,Published On : July 20, 2020 / 10:02 AM IST
కాఫీ తోటల్లో గో హత్యలు: అరటిపండ్లలో విషం పెట్టి 20 ఆవుల్ని చంపి గోతిలో పడేశారు

కర్ణాటకలో అత్యంత అమానవీయ దారుణం జరిగింది. కాఫీ తోటలోకి ఆవులు చొరబడి పాడు చేస్తున్నాయని అత్యంత పాశవికంగా వాటిని చంపేశారు. అరటి పండ్లలో విషం పెట్టి 20 ఆవులను చంపేశారు. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్‌లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోటల్నిపాడుచేస్తే వాటి యజమానులకు చెప్పాలి లేదా వేరే ఏమైనా చేయొచచ్చు కానీ ఏకంగా గోమాతల్ని అంత దారుణంగా చంపేయటమేంటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

పచ్చటి మేత కనిపిస్తే పశువులు అటువైపుగా వెళతాయి. మేత కోసం ఎంతదూరమైనా..ఎంత ఎత్తులకైనా వెళతాయి. అలాగే ఐగూరు ఎస్టేట్‌ సమీప గ్రామంలోని ఆవులు తరుచూ మేత కోసం వెళ్లేవి. దీంతో ఎస్టేట్‌లో ఉన్న కాఫీ తోటలు పాడైపోతున్నాయని ఎస్టేట్ నిర్వాహకులు తోటలోకి వచ్చిన ఆవులకు అరటి పండ్లలో విషం పెట్టి తినిపించేవారు. అలా అవి చనిపోయిన తరువాత వాటిని గుట్టు చప్పుడు కాకుండా చారు. ఎస్టేట్ లోని ఓ ప్రాంతంలో ఓ గోతిలో పడేసేవారు.

అలా కొంతకాలంగా కొన్ని ఆవులు కనిపించకపోవడంతో గ్రామస్ధులు అనుమానపడ్డారు. చుట్టు పక్కలంతా వెతికారు. కానీ ఆవు జాడ కనిపించలేదు. ఒకటి కాదు రెండు కాదు చాలా ఆవులు అలా కనిపించకుండా పోయేసరికి గ్రామస్థులకు అనుమానం వచ్చింది. కనిపించకుండా పోయిన ఆవులు ఒకటి కాకపోతే ఒక్కటి కూడా ఆచూకీ తెలియలేదు. అలా వెతగ్గా వెతగ్గా ఎస్టేట్ సమీపంలోని గోతిలో 7 ఆవుల కళేబరాలు కనిపించాయి. దీంతో గ్రామస్థుల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. వెంటనే ఎస్టేట్ నిర్వాహకులను నిలదీశారు.

దీంతో నిర్వాహకులు ఆవుల్ని తామే చంపామని అంగీకరించారు. దీంతో గ్రామస్థులు తెల్లబోయారు. మానవత్వం లేకుండా ఆవుల్ని చంపేశామని ఎంత నిర్థయగా చెబుతున్నారో అని ఆగ్రహించారు. అలా ఇప్పటి వరకు 20 ఆవులను చంపారని వాటి యజమానులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.