Viral Video: బాస్‌కు గిఫ్ట్ ఇచ్చిన ఉద్యోగులు.. మేనేజర్ ఇచ్చిన రియాక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా

Viral Video: బాస్‌కు గిఫ్ట్ ఇచ్చిన ఉద్యోగులు.. మేనేజర్ ఇచ్చిన రియాక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా

Viral Video

Updated On : December 29, 2022 / 5:47 PM IST

Viral Video: ఉద్యోగులకు యజమానులు అప్పుడప్పుడు బహుమతులు, బోనస్ లు ఇస్తుంటారు. అయితే, సంస్థలో పనిచేసే బాస్ కు ఉద్యోగులు గిఫ్టులు ఇవ్వడం చాలా అరుదు. సాధారణంగా పదవీ విరమణ చేసే సమయంలోనే గిఫ్టులు ఇస్తుంటారు. అందులోనూ చాలా ఖరీదైన బహుమతులు ఇవ్వడం కూడా చాలా అరుదు. అయితే, ఓ సంస్థలో పనిచేసే ఉద్యోగులు క్రిస్మస్ సందర్భంగా తమ బాస్ కు ఖరీదైన గిఫ్టు ఇచ్చి ఆశ్చర్యపర్చారు.

ఆ గిఫ్టును తెరిచి చూసిన ఆ బాస్ కూడా అమితాశ్చర్యానికి గురి కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యూకేలోని మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ లో ఉద్యోగులు అందరూ కలిసి తమ మేనేజర్ కు గిఫ్టు ఇచ్చారు. ఆ మేనేజర్ దాన్ని తెరిచి చూస్తే అందులో ల్యాప్ టాప్ ఉంది.

తమ మేనేజర్ కి కష్టపడి పనిచేసేతత్వం ఉందని, అందుకే క్రిస్మస్ సందర్భంగా ఈ బహుమతి ఇవ్వాలని అందరం భావించి, దాన్ని ఇచ్చామని మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగులు చెప్పారు. విధుల్లో తమ మేనేజర్ చూపే నిబద్ధత తమను బాగా ఆకట్టుకుంటుందని అన్నారు. గిఫ్టును చూసి సంతోషపడుతూ మేనేజర్ ఇచ్చిన రియాక్షన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Telangana DGP: తెలంగాణ ఇన్‌ఛార్జి డీజీపీగా అంజ‌నీ కుమార్.. మహేశ్ భగవత్ సహా ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ