సన్నబియం పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 12:16 PM IST
సన్నబియం పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. సన్న బియ్యం పంపిణీకి సంబంధించి మీడియాతో మాట్లాడిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై స్వర్ణ రకం ధాన్యాన్నే కొనుగోలు చేస్తామని మంత్రి కొడాలి నాని చెప్పారు. సన్న బియ్యంలో అన్ని రకాల వెరైటీలు కలిసిపోయాయన్న మంత్రి.. స్వర్ణ రకం నుంచి మిగిలిన రకాలను విడదీయడం ఇప్పుడు సాధ్యం కాదన్నారు. 

టీడీపీ ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యంలో 15-20 రకాల బియ్యం ఉన్నాయని.. 25 శాతానికి మించిన నూకలు ఉన్నాయని ఆరోపించారు. ఇక ముందు ఇలా జరగదని, స్వర్ణ రకం తరహా ధాన్యాన్నే కొనుగోలు చేస్తామన్నారు. స్వర్ణ రకం ధాన్యం పండించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుని రైతుల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఉండేందుకు బియ్యాన్ని బ్యాగుల్లో పంపిణీ చేస్తామన్నారు.

ప్రస్తుతానికి ప్లాస్టిక్ కవర్ల ద్వారా సరఫరా చేస్తున్నా.. భవిష్యత్తులో మాత్రం పేపర్‌ బ్యాగులనే వాడతామన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే సన్న బియ్యంలో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా..? అనే అంశంపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని.. మనం తినడానికి పనికి రాని బియ్యాన్ని ఎఫ్.సీ.ఐ ద్వారా కేంద్రానికే ఇచ్చేస్తామన్నారు. పౌరసరఫరాల శాఖకు రూ.20 వేల కోట్ల ఓడీ ఉంటుందన్న మంత్రి….. గత ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు డ్రా చేసి మిగతా అవసరాలకు వాడిందని ఆరోపించారు.