స్కూల్ క్లాస్ రూంలో పేలిన సెల్ ఫోన్

  • Edited By: madhu , January 19, 2019 / 03:11 AM IST
స్కూల్ క్లాస్ రూంలో పేలిన సెల్ ఫోన్

జనగామ : ఓ విద్యార్థి చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలింది. దీనితో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అసలు ఆ విద్యార్థి చేతిలోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది ? తరగతి గదిలోకి ఆ ఫోన్ ఎలా తీసుకొచ్చాడనేది తెలియరావడం లేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో ప్రాథమిక పాఠశాల ఉంది. మామిడాల శంకర్ కుమారుడు రాజు మూడో తరగతి చదువుతున్నాడు. జనవరి 18వ తేదీ యదావిధిగా స్కూలుకు వచ్చాడు. పుస్తకాల సంచీలో నుండి ఓ సెల్ ఫోన్ తీసుకుని ఆడుతున్నాడు. ఒక్కసారిగా అది పేలింది. దీనితో రాజు ఛాతి..ఓ చేతికి తీవ్రగాయాలయ్యాయి. పెద్ద శబ్ధం రావడంతో తోటి విద్యార్థులు భయపడిపోయారు. ఈ విషయం ఉపాధ్యాయులకు తెలిసింది. గాయపడిన రాజును స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సెల్ ఫోన్ బ్యాటరీ కారణమని తెలుస్తోంది. సెల్ ఫోన్ అంటే చిన్నారులు కూడా అట్రాక్టివ్ అవుతున్నారనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.
సెల్ ఫోన్ వాడకంలో చిన్నారులకు తగిన జాగ్రతలు..సూచనలు..సలహాలు ఇస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.