ఆపరేషన్ వశిష్ట-2 సక్సెస్ : పట్టువదలని విక్రమార్కుడు ధర్మాడి సత్యం

ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట సక్సెస్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది. రాయల్‌ వశిష్టను

  • Published By: veegamteam ,Published On : October 22, 2019 / 10:13 AM IST
ఆపరేషన్ వశిష్ట-2 సక్సెస్ : పట్టువదలని విక్రమార్కుడు ధర్మాడి సత్యం

ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట సక్సెస్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది. రాయల్‌ వశిష్టను

ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట సక్సెస్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును ధర్మాడి సత్యం బృందం వెలికితీసింది. రాయల్‌ వశిష్టను బోటును వెలికితీసిన డీప్ సీ డైవర్లు… మరో రెండు గంటల్లో ఒడ్డుకు తీసుకురానున్నారు. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత ధర్మాడి టీమ్‌ బోటును వెలికితీసింది. నెల రోజులకుపైగా నీటిలో నానిపోవడంతో బోటు పూర్తిగా ధ్వంసమైంది.

కచ్చులూరు సమీపంలోని పాపికొండల దగ్గర సెప్టెంబర్ 15న పర్యాటక బోటు మునిగిపోయింది. ఆ రోజు ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు వచ్చారు. వినోదం కోసం పాపికొండలకు బయలుదేరారు. ఊహించని విధంగా బోటు ప్రమాదం జరిగింది. నదిలో వరద ఉధృతంగా ఉందని తెలిసినప్పటికీ… ప్రైవేట్‌ టూరిజం యజమానులు కాసుల కక్కుర్తితో బోటును నడిపించారు. కచ్చులూరు దగ్గర సుడిగుండాలు ఉంటాయని తెలిసినా… గోదావరిపై పట్టులేని, అనుభవం లేని డ్రైవర్లకు బోటును అప్పగించారు. వరద ప్రవాహంలో గోదావరిపై వెళ్తున్న బోటును కట్టడి చేసేందుకు అధికారులు కూడా ప్రయత్నించలేదు. అందరూ కలిసి పర్యాటకుల్ని ప్రమాదంలోకి నెట్టేశారు.

ఆ రోజు బోటులో మొత్తం 77 మంది పర్యాటకులు ఉన్నారు. స్థానికుల సాయంతో 26 మంది సురక్షితంగా బయటపడగా… 51 మంది గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభించడంతో బంధువులకు అప్పగించారు. మరో 13 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. కాగా మంగళవారం(అక్టోబర్ 22,2019) బోటుతో పాటు 5 మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఇంకా 7 మృతదేహాల ఆచూకీ తెలియాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో బోటు ఏసీ క్యాబిన్‌లో ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో… బోటులోనే ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. బోటును వెలికి తీయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే కచ్చులూరు మందం దగ్గర ఉన్న భౌగోళిక పరిస్థితులు, గోదావరి వరద ఉధృతి కారణంగా బోటును వెలికి తీయడం కష్టతరంగా మారింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఇండియన్ నేవీ, డెహ్రాడూన్ నుంచి వచ్చిన స్పెషల్ వెసల్ రికవరీ టీం, ముంబై నుంచి వచ్చిన మెరైన్ ఎక్సపర్ట్స్ కూడా చేతులెత్తేశారు.

బోటును వెలికి తీయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి టెండర్లు ఆహ్వానించింది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థ… 22.70 లక్షలతో టెండర్‌ను దాఖలు చేయడంతో ప్రభుత్వం వారికి అనుమతి ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం… సెప్టెంబర్ 30న ఆపరేషన్ రాయల్ వశిష్టను ప్రారంభించింది. మూడ్రోజుల పాటు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ… బోటు జాడ కనిపెట్టలేకపోయింది. ఆ తర్వాత వాతావరణం కూడా సహకరించకపోవడంతో… మొదటి దశలో ఆపరేషనల్‌ రాయల్‌ వశిష్టను విఫలమైంది.

గోదావరిలో బోటు మునిగిన నెల రోజుల తర్వాత వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో… వారం రోజుల క్రితం ధర్మాడి బృందం రెండో విడత ఆపరేషన్‌ మొదలుపెట్టింది. జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతి తీసుకుని… మరోసారి బోటు వెలికితీత పనులు మొదలుపెట్టింది. నాలుగు రోజులు క్రితం రెయిలింగ్‌ను కూడా బయటకు తీసింది. నాలుగు రోజుల క్రితం యాంకర్‌కు బలమైన వస్తువు తగిలింది. ఈ క్రమంలో బోటు రెయిలింగ్‌ ఊడిపోగా… దాన్ని ఒడ్డుకు లాగారు. దీంతో బోటు ఆచూకీని పక్కాగా గుర్తించిన ధర్మాడి సత్యం టీమ్… దాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాలుగు రోజుల పాటు సంప్రదాయ పద్ధతిలో బోటును వెలికితీసేందుకు ప్రయత్నించి విఫలమైన ధర్మాడి సత్యం… ఆ తర్వాత రూట్‌ మార్చారు. విశాఖ వెళ్లిన ధర్మాడి సత్యం 10 మంది డీప్‌ సీ డైవర్స్‌ను తీసుకొచ్చారు. వీరంతా మూడు రోజుల పాటు బోటును వెలికితీసేందుకు పట్టు వదలకుండా ప్రయత్నించారు. నిత్యం నదీ గర్భంలోకి వెళ్లి… బోటు చుట్టూ రోప్‌ చుట్టి బయటకు లాగేందుకు ట్రై చేశారు.

విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్‌ వాటర్‌ సర్వీసెస్‌కు చెందిన ఆరుగురు డైవర్లు ఆదివారం ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు. దాదాపు 15 నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంతమేర పేరుకుపోయాయి? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలించి వచ్చారు. ఇలా ఆరుసార్లు డైవర్లు బోటు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆదివారం సాయంత్రం బోటు ముందు భాగానికి… సోమవారం ఉదయం వెనుక భాగానికి తాళ్లు కట్టారు. ఈ తాళ్లను పొక్లెయిన్‌కు కట్టి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భారీగా లోడు పడటంతో… కచ్చితంగా బోటే బయటకు వస్తుందని భావించారు. పొక్లెయిన్‌ సాయంతో లాగేటప్పుడు మధ్యలో ఎక్కడైనా రోప్‌ జారిపోయిందా అన్న అనుమానంతో… ఒకటికి రెండుసార్లు డీప్‌ సీ డైవర్లు నదీ గర్భంలోకి వెళ్లి పరిశీలించి వచ్చారు.

తాళ్లు యధావిధిగా వేసిన స్థానంలోనే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత బోటును పొక్లెయిన్ సాయంతో బయటకు లాగారు. కానీ… మళ్లీ నిరాశే ఎదురైంది. సోమవారం కూడా పూర్తిస్థాయిలో బోటును బయటకు తీయలేకపోయారు. దానికి సంబంధించిన శకలాలు మాత్రమే బయటకు వచ్చాయి. పైకప్పును మాత్రమే బయటకు తీయగలిగారు. డ్రైవర్‌ క్యాబిన్‌, గేర్‌ రాడ్‌, బోటు మోటార్‌, రాయల్‌ వశిష్ట బోర్డు సహా ముందు భాగంలో ఉండే పరికరాలను నదిలో నుంచి బయటకు తీసుకొచ్చింది. నెలరోజులుగా నీటిలో నానిపోయి ఉండటంతో తాళ్లకు చిక్కిన బోటు ముక్కలు ముక్కలుగా బయటకు వచ్చింది.

7వ రోజున జోరు వానలోనూ ధర్మాడి బృందం ఆపరేషన్‌ కొనసాగించింది. మంగళవారం మూడుసార్లు నదిలోకి వెళ్లి బోటును పరిశీలించిన డైవర్లు… ముందు, వెనుక భాగంలో రోప్‌ బిగించి వచ్చారు. ఆ తర్వాత పొక్లెయిన్ల సాయంతో బోటును నీటి పైకి తీసుకొచ్చారు.