నన్ను కొట్టడానికి 100మంది వచ్చి.. చప్పట్లు కొట్టి వెళ్లారు

  • Published By: vamsi ,Published On : March 23, 2019 / 03:44 AM IST
నన్ను కొట్టడానికి 100మంది వచ్చి.. చప్పట్లు కొట్టి వెళ్లారు

తెలంగాణ సీఎం కేసిఆర్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా? తెలంగాణా ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నారా? పౌరుషం లేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. కేసిఆర్ వచ్చి వైసీపీ అభ్యర్ధులను టీఆర్ఎస్ అభ్యర్ధులుగా ప్రకటించుకోండి అని చెప్పారు. కేసీఆర్‌ ఇక్కడ అడ్డదారి రాజకీయాలు చేస్తే వదిలేసే ప్రసక్తి లేదన్నారు. ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదార్లు, పనికిమాలినవాళ్లు, దగాకోర్లు అంటూ తెలంగాణ నాయకులు తిడుతుంటే అలాంటి నాయకులను జగన్ భుజాన మోస్తాడా? అంటూ విమర్శించారు. 
Read Also : మీకు మీరే సాటి : పాల్ చేష్ట‌లు – వ‌ర్మ సెటైర్లు

హీనంగా తిట్టినవారి పంచన చేరడానికి మీకు సిగ్గు లేదా? అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. భయపడుతూ ఎంతకాలం ఉంటామని, ధైర్యంగా ఉందామని పౌరుషమే లేదా? అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇక్కడకు వచ్చి వైసీపీకి మద్దతు ఇస్తారా? వైసీపీకి వంత పాడుతారా? అని నిలదీశారు. జగన్‌కు కేసీఆర్‌ అంటే భయం. కేసీఆర్‌ ఒక ఉద్యమ నాయకుడనే గౌరవం తప్ప తనకు ఆయనంటే భయం లేదని పవన్ అన్నారు. అక్కడేదో తనకు ఇల్లుందని, ఆస్తులున్నాయని, పదెకరాల భూములున్నాయనే భయం తనకు లేదన్నారు ఏం భూములు తీసుకుంటారా? తీసుకోమనండన్నారు. 

ఇక తెలంగాణలో తనను కొట్టడానికి 100మంది వచ్చారని, కొట్టేందుకు వచ్చి జనంలో దూరిపోయారని చెప్పారు. అయినా కూడా సత్యం మాట్లాడతామని, తప్పుంటే సరిదిద్దుకుంటామని, తప్పు చేస్తే తోలు తీస్తాం అన్నారు. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు తనను ఎన్ని లక్షల మంది బెదిరించినా ఆపలేదని, ఆ రోజు తనను కొట్టడానికి వచ్చినవాళ్లు కూడా చప్పట్లు కొట్టి వెళ్లిపోయారని పవన్‌ అన్నారు.
Read Also : పవన్‌ది ఆదర్శమే.. నామినేషన్ తిరస్కరిస్తే?‌