పవర్ & పాలిటిక్స్ : ఏపీలో కాక పుట్టిస్తున్న రాజకీయాలు

  • Published By: madhu ,Published On : March 7, 2019 / 12:51 PM IST
పవర్ & పాలిటిక్స్ : ఏపీలో కాక పుట్టిస్తున్న రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఓట్ల తొలగింపు, ఫాం7లు లక్షల్లో దరఖాస్తులు చేస్తున్నారనే విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మార్చి 07వ తేదీ గురువారం ఎలాంటి రాజకీయ పరిణామాలు జరిగాయో ఒకసారి చూద్దాం. 
Also Read : సిట్ షాకింగ్ న్యూస్ : సేవామిత్ర యాప్‌లో తెలంగాణ డేటా

ఓట్ల తొలగింపు.. తదితర వాటిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 11 తరువాత ఒక్క ఓటు కూడా తొలగించలేదని..తొలగిస్తే ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. రాజకీయ పార్టీలు ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, అలాంటి పనులు చేయవద్దని ద్వివేది సూచించారు. 

అటు డేటా చౌర్యాన్ని సీరియస్‌గా తీసుకుంది ఏపీ సర్కార్. సంక్షేమ పథకాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే డేటా దాడులు, ఫాం-7 కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కోసం పని చేస్తున్న కంపెనీని దెబ్బతీసి రాజకీయంగా నష్టం చేయడానికి.. కేసులతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఏపీని దొంగదారిన దెబ్బతీస్తామంటే సహించేది లేదన్నారు.
Also Read : చెక్ చేసుకోండి : మహిళల ఖాతాల్లోకి రూ.3,500 వేసిన చంద్రబాబు

డేటా చౌర్యంపై సిట్‌ వేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు హోం మంత్రి చినరాజప్ప. మరోవైపు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ…సీఎం చంద్రబాబును కలిశారు. ఈ నెల 17వ తేదీన చంద్రబాబు సమక్షంలో..టీడీపీ కండువా కప్పుకోనున్నారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి కొణతాల పోటీ చేస్తారని పక్కా అని తేలిపోయింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జయసుధ…వైసీపీలో చేరారు.
Also Read : మీ ఓటు సేఫ్‌గా ఉండాలంటే : వెంటనే ఇలా చేయండి