పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించడం సాధ్యమే: ఆర్‌బీఐ | RBI Governor Shaktikanta Das speaks on petrol prices

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించడం సాధ్యమే: ఆర్‌బీఐ

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించడం సాధ్యమే: ఆర్‌బీఐ

దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ఆర్థికవేత్తలు, పలువురు సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. పన్నుల తగ్గిస్తే ఇందన ధరలు తగ్గించడం కష్టం కాదని చెప్పారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాలంటే, పన్నుల తగ్గించాల్సిన ఆవస్యకత ఉందని శక్తికాంతదాస్ వెల్లడించారు.

ఇందన ధరలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, పెట్రోల్‌, డీజిల్‌పై విధించే పరోక్ష పన్నులను తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతోన్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవం. కరోనా అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆదాయం, ప్రభుత్వ ఖర్చులను కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ, వీటిని తగ్గించకపోతే మళ్లీ ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికీ, ఇంధన ధరల వల్ల రానున్న రోజుల్లో తయారీ, ఉత్పత్తి రంగంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. గడిచిన పది రోజులుగా దేశంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయని.. కొన్ని రాష్ట్రాల్లో లీటరు రూ.100కు చేరువ అయినట్లుగా తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించకపోవడంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

×