టీడీపీలోకి సబ్బం హరి: భీమిలిలో గెలిపిస్తా..!

టీడీపీలోకి సబ్బం హరి: భీమిలిలో గెలిపిస్తా..!

టీడీపీలోకి సబ్బం హరి: భీమిలిలో గెలిపిస్తా..!

అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ స‌బ్బం హ‌రికి తెలుగుదేశం అసెంబ్లీ సీటు కేటాయించింది. విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న సబ్బం హరి ఇవాళ(20 మార్చి 2019) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టీడీపీ గూటికి చేరుకోనున్నారు. ఈ క్రమంలో మంగళవారం(19మార్చి 2019) నాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటి అయిన సబ్బం హరి.. తాజా రాజకీయాలపై చర్చించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడిన హరి.. చంద్రబాబు సీఎం అయితేనే అమరావతి పనులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతాయని అన్నారు. తనవంతు ఉడతాభక్తిగా భీమిలి సీటు గెలిచి చంద్రబాబుకు తోడ్పడతానని అన్నారు. నేతలు పార్టీలు మారినా కేడర్ మాత్రం చెక్కుచెదరలేదని, బీమిలిలో మేయర్‌గా తాను చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదని, ప్రత్యర్థుల ధన ప్రవాహం బీమిలిలో పనిచేయదని ఆయన అన్నారు.

ఇక బీమిలిలో అవంతి శ్రీనివాస్‌ను వైసీపీ బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. ఈ సీటుపై మొదటి నుంచి గందరగోళం నడిచింది. నారా లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో ఆయన మంగళగిరి నుంచి పోటీకి దిగారు.
 

×