ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్ : ఏపీకి పొంచి ఉన్న ముప్పు

శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడిపోయిందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండాపోతుందన్నారు.

  • Published By: veegamteam ,Published On : November 20, 2019 / 03:12 PM IST
ప్రమాదంలో శ్రీశైలం డ్యామ్ : ఏపీకి పొంచి ఉన్న ముప్పు

శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడిపోయిందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండాపోతుందన్నారు.

తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగు నీరు అందించే శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో పడిపోయిందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. గంగాజల్ సాక్షరత్ యాత్రలో భాగంగా ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టుల భద్రతను, నీటి వనరుల లభ్యతను అంచనా వేస్తున్నారు. మంగళవారం(నవంబర్19, 2019) ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం డ్యామ్ ను సందర్శించారు. బుధవారం(నవంబర్ 20, 2019) హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ డ్యామ్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించామని, ప్రాజెక్టులో భారీ గొయ్యి ఏర్పడుతోందన్నారు. డ్యామ్ లో క్షితిజ సమాంతరంగా పగుళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. డ్యామ్ కు మరమ్మతులు చేయకపోతే పెను విషాదం తప్పదని హెచ్చరించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండాపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల పతనానికి ప్రభుత్వాలే కారణమని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులు నిర్మించాక వాటి నిర్వహణను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వాలు నదులపై డ్యామ్ లు నిర్మిస్తున్నాయే తప్ప వాటి సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం లేదని విమర్శించారు.

శ్రీశైలం సమీపంలో నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే.. అంత త్వరగా డ్యామ్ ను పరిరక్షించుకోవచ్చన్నారు.