టీడీపీ సమన్వయ కమిటీ : సీనియర్లకు బాబు క్లాస్

  • Published By: madhu ,Published On : January 21, 2019 / 08:18 AM IST
టీడీపీ సమన్వయ కమిటీ : సీనియర్లకు బాబు క్లాస్

విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ తరుణంలో అలర్ట్‌గా ఉండాల్సిన సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు ? అంటూ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గుస్సా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే క్లాస్ తీసుకున్నారనే చెప్పాలి. సీనియర్ అనే ఇగోనా ? లేక పదవులున్నాయనే అహమా ? అంటూ కోపం ప్రదర్శించారు. ఇదంతా టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చోటు చేసుకుంది. 
హాట్ హాట్‌గా భేటీ
జనవరి 21వ తేదీన విజయవాడలోని అమరావతిలో సమన్వయ కమిటీ భేటీ జరిగింది. సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు, ఇతరులు వచ్చారు. ఈ భేటీ హాట్ హాట్‌గా కొనసాగింది. ఈ మీటింగ్‌లో సమావేశంలో బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ అంటూ ఇగో ప్రదర్శిస్తున్నారని…పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని పేర్కొన్నారు. బంధుత్వాలు..స్నేహాలను పక్కన పెట్టేయాలంటూ చురకలు అంటించారు. టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడకు వచ్చి టీడీపీపై విమర్శలు చేసినా పార్టీ సీనియర్లు స్పందించకపోవడం కరెక్టు కాదని…యాదవ వర్గానికి చెందిన నేతలు ఘాటుగా స్పందిస్తే బాగుంటేదని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కడా ప్రతిపక్షం బలహీన పడిందని అనుకోవద్దని బాబు పార్టీ నేతలకు దిశా..నిర్దేశం చేశారు. బాబు క్లాస్..దిశా.నిర్దేశంతో తెలుగు తమ్ముళ్లు ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తారో చూడాలి.