కేటీఆర్ – జగన్ భేటీపై జేసీ సంచలన వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : January 16, 2019 / 08:18 AM IST
కేటీఆర్ – జగన్ భేటీపై జేసీ సంచలన వ్యాఖ్యలు

విజయవాడ : కేటీఆర్ – జగన్ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరుగుతున్న ఈ చర్చలు పొలిటికల్‌గా హీట్ పెరుగుతోంది. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్‌లో జరుగుతున్న ఈ భేటీపై ఏపీ టీడీపీ కారాలుమిరియాలు నూరుతోంది. మోడీ డైరెక్షన్‌లో నడుస్తున్నారని..వైసీపీ..టీఆర్ఎస్ ముసుగు తొలగిపోయిందని ఏపీ టీడీపీ నేతలు నోటికి పని చెబుతున్నారు. ఈ భేటీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
జనవరి 16వ తేదీన ఎంపీ జేసీ మీడియాతో మాట్లాడారు. జగన్ – కేటీఆర్‌లు భేటీ కొత్తేమీ కాదని…ఏడాది నుండే కలిసి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కొత్తగా ఏం మాట్లాడుకుంటారంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు…శాశ్వత శత్రువులుండరన్న జేసీ…ఫెడరల్ ఫ్రంట్ లేదు..పాడూ లేదని కొట్టిపారేశారు. ఒక్కోసారి ఒక్కో పెద్ద మనిషికి కోపం వస్తుందని..ఇప్పుడు కేసీఆర్‌కి కోపం వచ్చిందని..కేసీఆర్..టీఆర్ఎస్ నేతలు అక్కసు తీర్చుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చి బురద పడేసి వెళుతున్నారని…పక్కనే కృష్ణా నది ఉంది..కడుక్కుంటామన్నారు.