ప్రాణం తీసిన సరదా…

  • Published By: bheemraj ,Published On : August 23, 2020 / 10:00 PM IST
ప్రాణం తీసిన సరదా…

నల్గొండ జిల్లా మూసినదిలో ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. ప్రాజెక్టు గేట్ల దిగువన కాలు జారి నీటిలో పడిపోవడంతో యువకుడు నీటిలో మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు వృధా అయిపోయాయి. రాళ్ల మధ్యలో చిక్కుకోవడంతోనే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు నకిరేకల్ పట్టణానికి చెందిన సాయిగా గుర్తించారు. ప్రాజెక్టు గేట్ల దిగువన ఈతకు దిగుతున్నా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.



మూసినది ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు చేరడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు నీటి ఉధృతి తగ్గడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆదివారం కావడంతో సమీప గ్రామాలు, నకిరేకల్ పరిసర ప్రాంతాలు, సూర్యపేట పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా అక్కడకు వచ్చి మూసీ అందాలను చూడటంతోపాటు గేట్లకు దిగువన ఉన్న రేలింగ్ పై ఈత కొట్టడం లాంటివి చేస్తున్నారు. అయితే దీని పట్ల చాలా కాలంగా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని విమర్శ ఉంది.



ఇది రెండు జిల్లాల సరిహద్దులో ఉండటం వల్ల పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణమని చెబుతున్నారు. రెండు జిల్లాల సరిహద్దు కావడంతో ఇది మా ప్రాంతాని రాదంటూ సూర్యపేట, నల్గొండ వైపు ఉన్న గేట్ల వైపు మాత్రమే ఉంటారు. కానీ దిగి ఈత కొడుతున్నప్పుడు వారించడం లేదు. అందరు ఉండి కూడా రాళ్లళ్లో ఇరుక్కపోవడంతో, చాలా సేపటి వరకు గమనించకపోవడంతోనే అతని ప్రాణం పోయినట్లు గుర్తిస్తున్నారు. ఆలస్యంగా గుర్తించి వెలికి తీసి అతన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నం వృధా అయింది.