టీటీడీ సంచలన నిర్ణయం : తిరుపతిలో సంపూర్ణ మద్య నిషేధానికి సిఫార్సు

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అద్యక్షతన బుధవారం(అక్టోబర్

  • Published By: veegamteam ,Published On : October 23, 2019 / 12:41 PM IST
టీటీడీ సంచలన నిర్ణయం : తిరుపతిలో సంపూర్ణ మద్య నిషేధానికి సిఫార్సు

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అద్యక్షతన బుధవారం(అక్టోబర్

తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన బుధవారం(అక్టోబర్ 23,2019) పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గరుడ వారధి నిర్మాణం, స్విమ్స్ ను టీటీడీ పరిధిలోకి తీసుకోవడం, మద్యం, ప్లాస్టిక్ బాటిళ్లపై నిషేధం సహా పలు అంశాలపై చర్చించి డెసిషెన్స్ తీసుకున్నారు. తిరుమల తరహాలోనే తిరుపతిలోనూ పూర్తి స్తాయిలో మద్యపాన నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు లేఖ పంపాలని టీటీడీ నిర్ణయించింది.

తిరుపతిలో 250 ఎకరాల్లో ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని నిర్ణయించారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయించారు. టీటీడీలో కూడా వంశపారంపర్య అర్చక వ్యవస్థ అమలు చేస్తామని టీటీడీ పాలకమండలి తెలిపింది. మాజీ ప్రధాన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోమని స్పష్టం చేసింది.

టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం కింద.. రూ.14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,550 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 386 కాంట్రాక్టు, 246 మంది కల్యాణకట్ట ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని.. 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన అధికారులు, పాలకమండలి సభ్యులకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తిరుమల తరహాలో తిరుపతిని కూడా పవిత్రంగా ఉంచాలని ఉద్దేశంతో తిరుపతిలో పూర్తి స్థాయిలో మద్యం నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గరుడ వారధి పూర్తిగా యాత్రికులకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసి రీటెండర్లు పిలవాలని నిర్ణయించుకున్నామన్నారు. స్విమ్స్ ఆస్పత్రిని టీటీడీ పరిధిలోకి తీసుకొని నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

టీటీడీ పాలకమండలి నిర్ణయాలు:
* బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి ఆమోదం
* తిరుమల తరహాలో తిరుపతిలోనూ పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం విధించాలని తీర్మానం
* గరుడ వారధి రీడిజైన్ చేసి రీటెండర్ పిలవాలని నిర్ణయం
* స్విమ్స్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయం
* టీటీడీ ఫారెస్ట్ శాఖలో 162 మంది సిబ్బంది రెగులరైజ్ కు నిర్ణయం
* 332 మంది కార్మికులకు టైమ్ స్కేల్ ఇవ్వాలని నిర్ణయం
* మరో మూడు నెలల్లో తిరుమలలో వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం