Viral Video: సైకిల్‌పై వెళ్తూ యువతి డ్యాన్స్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు

ఓ యువతి సైకిల్ పై వెళ్తూ చేసిన డ్యాన్స్ అందరినీ అలరిస్తోంది. సైకిల్ హ్యాండిల్ వదిలేసి, పాటకు తగ్గ హావభావాలు కనబర్చుతూ ఆమె డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ సినిమా కభీ ఖుషీ కభీ గమ్(K3G) లోని ‘యే లడ్కా హాయే అల్లా’ పాటకు ఆమె డ్యాన్స్ చేసింది. కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో ఈ పాటకు కాజోల్ డ్యాన్స్ చేస్తుంది.

Viral Video: సైకిల్‌పై వెళ్తూ యువతి డ్యాన్స్.. అదుర్స్ అంటున్న నెటిజన్లు

Viral Video

Viral Video: ఓ యువతి సైకిల్ పై వెళ్తూ చేసిన డ్యాన్స్ అందరినీ అలరిస్తోంది. సైకిల్ హ్యాండిల్ వదిలేసి, పాటకు తగ్గ హావభావాలు కనబర్చుతూ ఆమె డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ సినిమా కభీ ఖుషీ కభీ గమ్(K3G) లోని ‘యే లడ్కా హాయే అల్లా’ పాటకు ఆమె డ్యాన్స్ చేసింది. కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో ఈ పాటకు కాజోల్ డ్యాన్స్ చేస్తుంది.

కాజోల్ లా తయారై ఈ అమ్మాయి ఆ పాట పాడుతూ డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సైకిల్ పై డ్యాన్స్ చేస్తూ ఆమె చేసిన ప్రయోగాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ అమ్మాయి వేసుకున్న దుస్తులు, పెట్టుకున్న గాజులు, ధరించిన ఆభరణాలు కభీ ఖుషీ కభీ గమ్(K3G) లోని కాజోల్ ని గుర్తు చేశాయని కొందరు కామెంట్లు చేశారు.

ఆ అమ్మాయి టాలెంటే ఆమెను ఏదో ఒక రోజు గొప్ప స్థాయిలో నిలబెడుతుందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కాగా, కభీ ఖుషీ కభీ గమ్ సినిమా 2001, డిసెంబరు 14న విడుదలయింది. ఈ సినిమా కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చింది. ఇందులో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్, రాణీ ముఖర్జీ వంటి స్టార్లు నటించారు.

 

View this post on Instagram

 

A post shared by ? B_ush_ra? (@iamsecretgirl023)

Samantha : ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన సమంత.. శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో ఏడ్చేసిన సామ్..