PM MODI..Vande Bharat Express : వందే భారత్‌ రైలు ప్రారంభించటానికి హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ మరోసారి హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. 2022లో తెలంగాణకు నాలుగు సార్లు వచ్చిన ప్రధాని మరోసారి 2023లో తొలిసారిగా హైదరాబాద్ కు రానున్నారు. జంటనగరాల్లోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

PM MODI..Vande Bharat Express : వందే భారత్‌ రైలు ప్రారంభించటానికి హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ

To launch Vande Bharat Express.. PM MODI will come to Hyderabad

PM MODI Vande Bharat Express : ప్రధాని మోడీ మరోసారి హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. 2022లో తెలంగాణకు నాలుగు సార్లు వచ్చిన ప్రధాని మరోసారి 2023లో తొలిసారిగా హైదరాబాద్ కు రానున్నారు. జంటనగరాల్లోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జనవరి (2023) 19న వందే భారత్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

అనంతం పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న సభ ఏర్పాట్లను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలిస్తున్నారు. తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ ఈ ఏడాదిలో మరిన్ని బీజేపీ సభలు ఉంటాయని చెబుతోంది. ఈ సభలకు బీజేపీ అధిష్టానం నేతలు పాల్గొంటారని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. 19న రానున్న ప్రధాని మోడీ మరికొన్ని రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు వీలుగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ నేతలు రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలు..ఏర్పాట్లను తెలుసుకున్నారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు సంబంధించి రూ.700 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయి. ఈ పనులు ప్రధానిమోదీ చేతులమీదుగా ప్రారంభించేలా రైల్వేశాఖ ఆలోచన చేస్తోంది. అలాగే సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రెండో లైన్ పనులు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. వందే భారత్ రైలుతో పాటు ఈ 3 పనులకు కూడా రైల్వే శాఖ శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ కార్యాక్రమాలు పూర్తి అయ్యాక బీజేపీ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.