సూళ్లూరుపేటలో : వరల్డ్ థర్డ్ మల్టీఫ్లెక్స్

  • Edited By: veegamteam , January 7, 2019 / 04:39 AM IST
సూళ్లూరుపేటలో : వరల్డ్ థర్డ్ మల్టీఫ్లెక్స్

సూళ్లూరుపేట : ప్రపంచలోనే భారీ మల్టీప్లెక్స్ కు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరు పేట వేదికకానుంది.చెన్నై-కోల్‌కతా రహదారిపై సూళ్లూరుపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిండిపాళెం వద్ద దేశంలోనే భారీ మల్టీప్లెక్స్‌..ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ మల్టీఫ్లెక్స్ ను నిర్మిస్తున్నారు. 106 అడుగుల వెడల్పుతో భారీ తెర, 670 సీట్ల సామర్థ్యం, 3 డీ సౌండ్ సిస్టంతో దీనిని అత్యంత అధునాతనంగా నిర్మించేందుకు అంతా సిద్ధం అయిపోయింది.  ఏడున్నర ఎకరాల్లో యూవీ క్రియేషన్స్ అనే సంస్థ రూ.40 కోట్ల వ్యయంతో  ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత వెడల్పైన తెరలతో కూడిన థియేటర్లు రెండే ఉండగా..ఇది మూవడది కావటం విశేషం. ఈక్రమంలో ఆసియా ఖండంలోనే ఇది రెండవది కావటం మరో విశేషం. సూళ్లూరుపేటలో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌లో 170 సీట్ల సామర్థ్యం కలిగిన మరో రెండు స్క్రీన్లను కూడా నిర్మించనున్నారు.
స్పెయిన్ లో వున్న కైన్పోలిస్ మాడ్రిడ్ 17 సెప్టెంబర్ 1998 న ప్రారంభించిన ఇది ప్రపంచంలోని అతిపెద్ద సినిమా కాంప్లెక్స్ లో 21,200 సీట్ల కెపాసిటీ దీని స్పెషల్. మరొకటిది చైనాలోని షాంఘైకు పశ్చిమాన ఉన్న సుఝౌ, జియాంగ్సు . ఇది 113.5 అడుగుల (34.6 మీ) పొడవు మరియు ఎత్తులో 87.9 అడుగులు (26.8 మీ) ఎత్తు ఉండటం దీని స్పెషల్.