అధికారంలోకి వస్తే : లక్షాధికారులను చేస్తా

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 10:51 AM IST
అధికారంలోకి వస్తే : లక్షాధికారులను చేస్తా

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత

గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మహిళలపై హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఆడపడుచులకు నేనున్నాననే భరోసా ఇస్తానన్నారు. పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. మహిళలు వారి కాళ్లపై నిలబడేలా చేస్తామన్నారు.

వైఎస్సాఆర్ చేయూత పథకం కింద ప్రతి అక్క చేతిలో రూ.75వేలు పెడతామన్నారు. పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పారు. 4 దఫాలుగా పంట రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. చిలకలూరిపేటలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. సీఎం చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు. ఈ ఐదేళ్లలో భారీ అవినీతి జరిగిందన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులను చంద్రబాబు మోసం చేశారని, వారి ఆస్తులను మంత్రులు కాజేశారని జగన్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ స్కాంపై దర్యాఫ్తు జరిపిస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ కచ్చితంగా  న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. రైతు బాధలను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశానని జగన్ అన్నారు. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారని.. సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వలేదని  మండిపడ్డారు.

చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని జగన్ అన్నారు. రిషితేశ్వరి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చెయ్యలేదని, మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే చర్యలు లేవని జగన్ గుర్తు చేశారు. తమ హయాంలో మహిళల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని జగన్ మండిపడ్డారు. వైసీపీ ధికారంలోకి వస్తే 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తామన్నారు. ప్రతి గ్రామంలో మద్యం షాపులు తీసేసిన తర్వాతే ఓట్లు అడుగుతామన్నారు.

చంద్రబాబు పాలనలో వ్యవస్థలు నాశనమయ్యాయని జగన్ అన్నారు. ఓటు అడగలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనించాలన్నారు. తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్యతో చంద్రబాబు కుట్రలు క్లైమాక్స్ కు చేరాయని జగన్ అన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు.. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని జగన్ నిలదీశారు. చిలకలూరిపేటలో వైసీపీని గెలిపించాలని కోరిన జగన్.. సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తా అన్నారు.