'యాత్ర'లో జగన్ : నేను విన్నాను..  మీకోసం ఉన్నాను

‘యాత్ర’లో జగన్ : నేను విన్నాను..  మీకోసం ఉన్నాను

‘యాత్ర’లో జగన్ : నేను విన్నాను..  మీకోసం ఉన్నాను

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను, ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.  బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. ప్రజలకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ మాట్లాడారు. ఈ సభకు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరాగా పాదయాత్రలో తాను చూసిన ప్రజల కష్టాలను ప్రస్తావిస్తూ.. అవన్నీ విన్నాను అనీ, వాటిని అన్నింటినీ తీర్చేందుకు నేను ఉన్నాను అంటూ స్పష్టం చేశారు. మీ ఆవేదన నేను విన్నాను.. మీ బాధ నేను చూశాను.. అందుకే మీకు బరోసాగా నేను ఉన్నాను అంటూ వైఎస్ జగన్ అన్నారు.   
Read Also : చంద్రబాబుని చెడుగుడు ఆడిన పోసాని

పాదయాత్రలో రైతుల కష్టాలను చూశానని, ఆ కష్టాలకు అన్నింటినీ పరిష్కరించేందుకు నేను ఉన్నాను అని అన్నారు. డ్వాక్రా మహిళలకు న్యాయం జరగలేదని, తాను అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాను అని అన్నారు. పొదుపు సంఘాలలో ఉన్న అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబాలు బాగుంటాయి. గ్రామాలు బాగుంటాయి. రాష్ట్రం బాగుంటుంది అని జగన్ అన్నారు.
Read Also : పొలిటికల్ జట్కాబండి : ఇండిపెండెంట్ గా సుమలత పోటీ

గ్రామాలలో మందు అమ్మే షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, వాటి వల్ల అక్కచెల్లెమ్మలు పడే కష్టాలను నేను చూశాను అని, వాటిని పరిష్కిరించేందుకు నేను ఉన్నాను అని జగన్ అన్నారు. అలాగే ఫీజుల విషయంలో విద్యార్ధులను చూశానని, వారిని చదివించేందుకు్ వారికి అండగా ఉండేందుకు నేను ఉన్నాను అని జగన్ అన్నారు.
Read Also : ఎవరీ కొమ్మా పరమేశ్వర్ రెడ్డి : వివేక హత్య తరువాత మాయం

×