డేంజరస్ wedding photoshoot.. కొండ అంచున వేలాడుతూ ఫొజిచ్చిన కొత్త జంట

  • Published By: sreehari ,Published On : September 6, 2020 / 08:56 PM IST
డేంజరస్ wedding photoshoot.. కొండ అంచున వేలాడుతూ ఫొజిచ్చిన కొత్త జంట

Updated On : September 26, 2020 / 4:46 PM IST

Terrifying Wedding Photoshoot : పెళ్లికి ముందు వెడ్డింగ్ ఫొటోషూట్ అనేది ఇప్పుడు కామన్.. ఏదైనా ఒక కాన్సెప్ట్ ఎంచుకుని ఆ విధంగా ఫొటో షూట్ చేస్తుంటారు. తమ లైఫ్ మెమెరీగా డిజైన్ చేస్తుంటారు.. కొన్ని వెడ్డింగ్ ఫొటోషూట్ లు డేంజరస్‌గా కూడా డిజైన్ చేస్తున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో వెడ్డింగ్ షూట్ చేయడం ఎంత ప్రమాదకరమో పెద్దగా పట్టించుకోరు..

Bride and groom pose for terrifying wedding photoshoot hanging off the edge of a cliff

కొందరు కొండ అంచున నిలబడి ఇలా రిస్క్ చేసి మరి వెడ్డింగ్ షూట్ లతో సాహసాలు చేస్తున్నారు.. అర్కాన్సాస్‌లోని మౌంటెన్ హోమ్‌కు చెందిన ర్యాన్ మైయర్స్, (30) స్కై మైయర్స్ (28) తమ వెడ్డింగ్ షూట్ కోసం ఇలా డేంజరస్ పోజ్‌లో కొండ అంచున నిలబడ్డారు. కోవిడ్ -19 పరిమితుల పెద్ద ఎత్తున పెళ్లి వేడుకులు జరుపుకునే పరిస్థితి లేదు.. అందుకే చాలామంది తమ మ్యారేజ్ మెమెరీగా ఇలాంటి డేంజరస్ వెడ్డింగ్ ఫొటోషూట్‌ చేసేస్తున్నారు.



ఈ కొత్త జంట కొండ అంచున నిలబడి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఫొజిచ్చారు.. అదేలా నిలబడ్డారా? షాక్ అవ్వకండి.. భద్రత కోసం వారికి వెనుక తాడుతో కట్టి ఉంచారులేండి.. దూరం నుంచి చూడటానికి కొండ అంచు నుంచి కిందపడుతున్నట్టు ఉండేలా ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో క్లిక్ అనిపించాడు.

Bride and groom pose for terrifying wedding photoshoot hanging off the edge of a cliff



ఈ కొత్త జంట వివాహం 12 మంది అతిథులతో హాక్స్బిల్ క్రాగ్ వద్ద ఘనంగా జరిగింది. ఆ వేడుక తరువాత ఈ జంట వారి ఫోటోషూట్ కోసం పోజులిచ్చారు. ఇది చూడటానికి చాలా భయానకంగా ఉంది. ఈ ఫొటోషూట్ కు ముందు ఈ కొత్త జంట కొండపైకి ఎలా ఎక్కాలో శిక్షణ కూడా తీసుకుందంట..