#WednesdayWisdom : అభినందన్‌పై స్మృతి మీమ్స్
భారత వింగ్ కమాండర్ అభినందన్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లను తెగ ఆకట్టుకొంటోంది. ఇటీవలే పాక్ చెర నుండి క్షేమంగా అభినందన్ భారతదేశంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన చూపిన ధైర్యసాహసాలను ప్రతొక్కరూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read : మరీ విడ్డూరం : పాక్ టీ బ్రాండ్ అంబాసిడర్‌గా అభినందన్
వర్ధమాన్ ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసేలా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు. మార్చి 06వ తేదీ బుధవారం చేసిన ఫొటో వైరల్ అయిపోయింది. ఈ పోస్ట్‌కు ఆమె వెడ్నెస్ డే విజ్డమ్ ట్యాగ్‌ను జత చేశారు.
‘ఇద్దరు వ్యక్తులు కలిసి పరీక్ష రాస్తుంటారు. వారిలో గ్రీన్ కలర్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి పాకిస్తాన్ కాగా, పింక్ టీ షర్ట్ ధరించిన వ్యక్తి అభినందన్. పాకిస్తాన్ ఎదో అడుగుతుండగా.. అభినందన్ వెనుక నుంచి ఓ కాగితాన్ని అందజేస్తారు. అయితే ఆ కాగితాన్ని తెరచి చూసిన పాకిస్తాన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అందులో.. ఇది నేను మీకు చెప్పకూడదు (i’m not supposed to tell you this) అని రాసి ఉంటుంది’ ఇది స్మతి ఇరానీ షేర్ చేసిన మీమ్స్.