కోడెలపై దాడి : అంబటి రాంబాబుపై హత్యాయత్నం కేసు

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 07:08 AM IST
కోడెలపై దాడి : అంబటి రాంబాబుపై హత్యాయత్నం కేసు

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

గుంటూరు : సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుతో పాటు 60మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరో 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కేసుని విచారిస్తున్నామని, అంబటి పాత్ర ఉందా లేదా అన్నది నిర్దారిస్తామని సత్తెనపల్లి డీఎస్పీ తెలిపారు. కోడెలపై అంబటి దాడికి కుట్ర పన్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also : ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసిన చంద్రబాబు : వైసీపీ అనుమానం

గురువారం (ఏప్రిల్ 11,2019) పోలింగ్ రోజున రాజుపాలెం మండలం ఇనిమెట్లలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో కోడెల శివప్రసాద్‌కు గాయాలయ్యాయి. చినిగిన చొక్కా, గాయాలతోనే ఆయన పోలింగ్ కేంద్రానికి‌ వెళ్లి ఓటు వేశారు. కోడెల శివప్రసాదరావు కారుపైనా దాడి జరిగింది. ఆయన డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఇనిమెట్లలోని 106వ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ జరపాలని కోడెల డిమాండ్ చేశారు. భద్రత లేకుండా పోలింగ్ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

రాజుపాలెం మండలం ఇనిమెట్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్‌తో.. ఒక్కసారిగా గ్రామంలో అలజడి రేగింది. కోడెలపై దాడి ఘటనలో వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఇనిమెట్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కోడెలపై దాడి ఘటనలో అంబటి ప్రమేయం లేకున్నా కేసులు పెట్టడం దారుణం అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈసీ దగ్గరికి వెళ్లి చంద్రబాబు చేస్తున్న డ్రామలు ఎవరూ నమ్మరని అన్నారు. ఈవీఎంలను మేం ట్యాంపరింగ్ చేస్తామనే భయముంటే.. చంద్రబాబు స్ట్రాంగ్ రూమ్ ల దగ్గరే పడుకోవాలని బొత్స ఎద్దేవా చేశారు.
Read Also : ఓడిపోతామనే భయంతోనే ప్రేలాపనలు : తలసాని