Sajjala Ramakrishna Reddy : బాబు, పవన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు.. మే 13 తర్వాత షర్మిల కనిపిస్తారా?- సజ్జల ఫైర్

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ విషయంలో విష ప్రచారం చేస్తున్నారు. పవన్ వి దిగజారుడు ఆరోపణలు. పవన్ కి అయితే అనుభవం లేదు.. అజ్ఞానంతో మాట్లాడారు.

Sajjala Ramakrishna Reddy : బాబు, పవన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు.. మే 13 తర్వాత షర్మిల కనిపిస్తారా?- సజ్జల ఫైర్

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు మనిషి జన్మ ఎత్తలేదు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతీరోజూ అయన ప్రసంగంలో సగం జగన్ ను తిట్టడమే అని విమర్శించారు. చంద్రబాబు తలలో చిప్ పాడైందన్నారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ కోసం వృద్దులు అనేక ఇబ్బందులు పడ్డారని వాపోయారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇబ్బందులు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. రెండు నెలలు వాలంటీర్లను దూరం చేస్తే జగన్ పై అభిమానం పోదన్నారు సజ్జల. ఇంటివద్దకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నది చంద్రబాబే.. మళ్ళీ ఈరోజు అంటున్నది చంద్రబాబే.. అని సజ్జల విరుచుకుపడ్డారు.

”మొన్నటివరకూ dbt ద్వారా పెన్షన్ ఇవ్వాలి అన్నారు. ఇప్పుడు వద్దు అంటున్నారు. చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పని చేసుకొనివ్వకుండా మధ్యలో దూరి చెడగొడుతున్నారు. ఏం అధికారంతో అధికార యంత్రాంగంపై ఒత్తిడి తేస్తున్నావ్?
పెన్షన్ వల్ల వృద్దులు పడుతున్న ఇబ్బందులకు కారణం చంద్రబాబు అండ్ కో నే. ఈ 2 నెలలుగా వృద్దులు పడుతున్న ఇబ్బందులకు మాది బాధ్యత కాదు. 58 నెలలు 1వ తేదీన నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చాం.

కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబు, పవన్ లకే ఉంది. కులాల రాజకీయం కోసమే పవన్ తెచ్చారు. జగన్ ది కుల ప్రస్తావన లేని రాజకీయం. తుని ఘటనలో ఎక్కువ కేసులు బుక్ అయ్యింది వైసిపి వాళ్ళ పైనే. తుని ఘటనలో పవన్ కి డౌట్స్ ఉంటే చిరంజీవిని అడగాలి.

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ విషయంలో విష ప్రచారం చేస్తున్నారు. పవన్ వి దిగజారుడు ఆరోపణలు. పవన్ కి అయితే అనుభవం లేదు.. అజ్ఞానంతో మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు సీఎంగా చేసిన చంద్రబాబుకి తెలియదా..? ప్రజల్లో భయాందోళన పెంచేలా మాట్లాడుతున్నారు. ఓ ముఖ్యమంత్రి.. ప్రజల భూములు తాను అనుకున్నట్టు చేసెయ్యగలరా..? చట్టాలు, నిబంధనలు ఉంటాయి. వాటి ప్రకారం ఏదైనా జరుగుతుంది అని తెలియదా..? వీరిద్దరికీ రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేదు. జగన్ ది ఇచ్చే చెయ్యి.. చంద్రబాబుది లాక్కునే చెయ్యి. 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు.. చుక్కల భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.

కాంగ్రెస్ ఓ పార్టీనా..? అసలు ఆ పార్టీకి ఇక్కడ ఉనికి ఉందా..? షర్మిలకు ఏం అర్హత ఉంది మమల్ని అడగడానికి? మే 13 తర్వాత షర్మిల కనిపిస్తుందా..? మా మ్యానిఫెస్టో గురించి ప్రశ్నించే హక్కు షర్మిలకు లేదు” అని విరుచుకుడ్డారు సజ్జల.

Also Read : ఎన్నికల వేళ జనసేనకు సింబల్ కష్టాలు.. ఈసీ కీలక ఆదేశాలు