ఎన్నికల వేళ.. బీజేపీలోకి ఎంపీ, మాజీ మంత్రి

ఇటీవల కాంగ్రెస్ లో చేరి అక్కడ టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న వెంకటేశ్ నేత ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు.

ఎన్నికల వేళ.. బీజేపీలోకి ఎంపీ, మాజీ మంత్రి

BorlaKunta Venkatesh Netha Joins Bjp (Photo Credit - Facebook-BJP4Telangana)

BorlaKunta Venkatesh Netha : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీలో చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు వెంటేష్ నేత. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్
దక్కకపోవడంతో కొన్నిరోజులుగా అసంతృప్తితో ఉన్న వెంకటేశ్ నేత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యారు.

మళ్ళీ బీజేపీలోకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి..
మాజీ మంత్రి పెద్దిరెడ్డి మళ్లీ బీజేపీ గూటికి చేరనున్నారు. రేపు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. పెద్దిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. అందుకు పెద్దిరెడ్డి అంగీకరించారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ నుండి బీఆర్ఎస్ లో చేరారు పెద్దిరెడ్డి. గతంలో టీడీపీ, నవ తెలంగాణ, ప్రజారాజ్యం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు పెద్దిరెడ్డి. ఇప్పుడు మరోసారి కమలం గూటికి చేరనున్నారు.

అటు.. మంథని టికెట్ ఆశించి భంగపడ్డ జెడ్పీటీసీ చల్ల నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వీడారు. ఇప్పుడు మరోసారి బీజేపీ కండువా కప్పుకున్నారు.

అందుకే.. బీజేపీలోకి- మాజీ మంత్రి పెద్దిరెడ్డి
బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మూడు సంవత్సరాలు బీజేపీలో పని చేశా. హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ నన్ను పిలిచారు. కానీ వారు అనుసరిస్తున్న విధానం నచ్చక తిరిగి బీజేపీలో చేరుతున్నా. దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్న నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలనే బీజేపీలోకి వస్తున్నా. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేయవద్దు.

Also Read : అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు.. సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు